కరోనా వైరస్ కారణంగా ప్రపంచ దేశాలు లాక్ డౌన్ విధించడంతో సినిమా థియేటర్లు దాదాపు రెండు నెలల నుంచి మూతపడ్డాయి. దీంతో సినిమాలు మొత్తం కంప్లీట్ చేసి రిలీజ్ చేయాలనుకుంటున్న నిర్మాతలు చాలా నష్టపోతున్నారు. ఇటువంటి సమయంలో కంప్లీట్ అయి రిలీజ్ అవటానికి రెడీగా ఉన్న సినిమాలను ఓటీటీ ప్లాట్ ఫాంలు ద్వారా రిలీజ్ చేసేస్తున్నారు. మరోపక్క ఓటీటీ ప్లాట్ ఫాంలకు రోజులు రావడంతో వాటిలో రిలీజ్ అయ్యే వెబ్ సిరీస్ లపై ప్రేక్షకులకు మరింత ఇంట్రస్ట్ నెలకొంది.IHG's Paatal Lok LEAKED Online & You Know Who's The ...

ఈ సందర్భంగా అమెజాన్ ప్రైమ్ ద్వారా రిలీజ్ అయిన ‘పాతాళ్ లోక్’ వెబ్ సిరీస్ లాక్ డౌన్ ఈ సమయంలో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ప్రస్తుతం ప్రేక్షకులు అంతా ఇంటిపట్టున ఉండటంతో ‘పాతాళ్ లోక్’ వెబ్ సిరీస్ బాగా వీక్షిస్తున్నారు. క్రైమ్ థ్రిల్లర్ డ్రామా గా రూపొందిన ఈ సిరీస్ ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉత్కంఠభరితంగా ఉంది. బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ స్థాపించిన నిర్మాణ సంస్థ ‘క్లీన్ స్లేట్ ఫిలింస్’ ఈ సిరీస్ నిర్మించింది. తరుణ్ తేజ్‌పాల్ రచించిన ‘ది స్టోరీ ఆఫ్ మై అసాసిన్స్’ అనే పుస్తకం ఆధారంగా రూపొందిన ఈ సిరీస్‌ని సుదీప్ శర్మ రచించగా అవినాష్ అరుణ్, ప్రోసిత్ రాయ్ దర్శకత్వం వహించారు. 

 

స్టోరీ ఏమిటంటే :-

 

ఢిల్లీ రాష్ట్రంలో జమునా పార్ పోలీస్ స్టేషనులో ఇనస్పెక్టరుగా హాతీరామ్ చౌదరి (జైదీప్ అహ్లావత్)కి భాధ్యతలు నిర్వహిస్తూ ఉండటంతో ఒక పెద్ద కేసును అప్పగిస్తారు. అయితే ఈ కేసులో ప్రముఖ జర్నలిస్టు సంజీవ్ మెహ్రా (నీరజ్ కాబి) హత్యకి పథకం పన్నారనే ఆరోపణతో నలుగురు నేరస్థులను పోలీసులు అరెస్టు చేస్తారు. హాతీరామ్ తన సబార్డినేట్ అన్సారీ (ఇష్వక్ సింగ్) సాయంతో ఇన్వెస్టిగేష్న్ మొదలు పెడతాడు. హంతకుల బృందానికి నాయకుడు అయిన విశాల్ త్యాగి అలియాస్ ‘హతోడా’ త్యాగి (అభిషేక్ బెనర్జీ) గురించిన భయంకరమైన నిజాలు వెలుగులోకి వస్తాయి. పరిశోధనలో ముందుకు సాగిపోతున్న హాతీరామ్‌ని హఠాత్తుగా సస్పెండ్ చేసి కేసును సిబిఐకి పై ఆఫీసర్లు అప్పగిస్తారు. సస్పెండయిన హాతీరామ్ ఇన్వెస్టిగేషన్ ఆపకుండా కేసుకు సంబంధించిన పెద్ద తలకాయల వరకూ వెళ్ళిపోతాడు. సంజీవ్ మెహ్రాని చంపడానికి పథకం ఎవరు వేసారు.? నలుగురి నేరస్థుల నేపధ్యం ఏమిటి? అనేది సిరీస్ చూసి తీరాల్సిందే.

IHG's web series feels ...

 

టోటల్ గా ఎలా ఉందంటే:-

 

ప్రతి ఎపిసోడ్ 40 నిమిషాలకు పైగా చిత్రీకరించడంతో ఈ సిరీస్ లో టోటల్గా తొమ్మిది ఎపిసోడ్స్ ఉన్నాయి. మొదటి ఎపిసోడ్ చూశాక మిగతా 8 ఎపిసోడ్ లు చూసేయాలి అనే విధంగా ఈ వెబ్ సిరీస్ ఉంది. ‘పాతాళ్ లోక్’ వెబ్ సిరీస్ లో చీకటి రాజ్యంలో భయంకరమయిన వాస్తవాలు, పసిపిల్లలపై జరిగే దారుణాలు, ఆడవారిపై చేసే అఘాయిత్యాలు వంటి దారుణాలని కళ్ళకి కట్టినట్లు చూపించారు. మనుషులను నిర్దాక్షిణ్యంగా చంపేసే పాత్రలు జంతు ప్రేమ చూపించడం అనేది కథలో కీలకాంశంగా చూపించటం అర్థవంతంగా అనిపిస్తుంది.

 

సాంకేతిక వర్గం :

 

చీకటి రాజ్యపు నేపధ్యంలో తెరకెక్కించిన సిరీస్ కి సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైన్, మ్యూజిక్ అన్నీ సరిగ్గా కుదిరాయి. ఈ సిరీస్ టెక్నికల్‌గా ఏ బాలీవుడ్ సినిమాకీ తీసిపోదు.

 

రేటింగ్ : 3/5

మరింత సమాచారం తెలుసుకోండి: