కరోనా వైరస్. ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. కరోనా అంటే భయంతో వణికిపోయేవారిని, దేశాధిపతులను చూసింది. ఈ మహమారిని చూసి జ్వరం పెట్టుకుని, ఆపై రోగం చుట్టుకుని చావు అంచుల దాకా వెళ్ళిన వారిని కూడా చూసింది. కానీ టాలీవుడ్లో మాత్రం కరోనాను చూసి ఏ మాత్రం భయపడడంలేదు సరికదా కరోనా మాకు మంచి కంటెంట్ ఇచ్చింది అంటున్నారు.

 

ఈ విషయంలో వివాదాస్పద దర్శకుడు  రాం గోపాల్ వర్మ మొదటి ఓటు వేశారు. ఆయన కరోనాతో  ఏకంగా ఒక సినిమా తీసేశారు. లాక్ డౌన్ టైంలో సెలిబ్రిటీలు దిక్కు తోచక రోజు గడవకా  అంతా వంటలు చేస్తూ ఇళ్ళు, నట్టిళ్ళూ తిరుగుతూంటే తాను మాత్రం తాపీగా కరోనా మీద సినిమా తీశానని ఈ మధ్యే గొప్పగా నాగబాబు చెప్పుకున్నారు. ఒక దగ్గు ఎంతటి భయంకరంలో వర్మ తన మూవీ టీజర్లో చూపించాడు.

 

దగ్గుకు కూడా రీసౌండ్, అదిరిపోయే ఆర్ ఆర్ ఇవ్వడం అంటే నిజంగా కరోనా మహిమ ఎలా ఉందని చెప్పాలి అనిపించకమానదు. ఇక మరో దర్శకుడు ప్రశాంత్ వర్మ కూడా కరోనా మీదనే ఒక సినిమా తీసేశాడట. కరోనా ముందు తరువాత ప్రపంచం అన్న కాన్సెప్ట్ తో పాటు వ్యాక్సిన్ వస్తే ఎలా ఉంటుంది అన్న దాని మీద ఆయన కధ అల్లుకుని తన సినిమా తీస్తున్నాడుట.

 

ఇవన్నీ చూసినపుడు కధా వస్తువుగా కరోనా ఎంతబాగా పనికివస్తుందో మన దర్శకులు రుజువు చేశారనిపిస్తుంది. కరోనా అంటే అంతా వణికి చస్తూంటే సినిమాలు తీసి కరోనాకే షాక్ ఇస్తున్నారుగా. ఏది ఏమైనా కాదేదీ కవితకు అనర్హం అని మహా కవి శ్రీశ్రీ అన్నాడు, కాదేదీ సినిమా కధకు అనర్ఘం అని మన ఇద్దరు వర్మలు అంటున్నారు.

 

మరెంతమంది కరోనా పేరిట సినిమాలు తీస్తారో. ఎన్ని తీసినా ఎన్నో ఎమోషన్లు ఈ మహమ్మారి రాజేసి పోయిందిగా. అందువల్ల కన్నీటి కధలు, వణికించే కధలు ఎన్ని అయినా కరోనానుంచి రావడం ఇకపైన కూడా ఖాయమని అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: