‘బాహుబలి’ తో నేషనల్ సెలిబ్రిటీ స్థాయికి ఎదిగిన రాజమౌళి వల్ల తెలుగు ఫిలింఇండస్ట్రీకి కూడ జాతీయస్థాయిలో గుర్తింపు వచ్చింది. ఒక తెలుగు సినిమా జాతీయస్థాయిలో వేయి కోట్లు కలెక్ట్ చేయగలదు అని నిరూపణ కావడంతో ఇప్పుడు దక్షణాదికి చెందిన ప్రముఖ దర్శక నిర్మాతలు ‘బాహుబలి’ రేంజ్ సినిమాలను తీయడానికి ప్రయత్నిస్తున్నారు.


అయితే ఇప్పటివరకు అలా ప్రయత్నిస్తూ వచ్చిన ఏసినిమా ‘బాహుబలి’ రేంజ్ హిట్ ను అందుకొక పోవడంతో రాజమౌళి ‘బాహుబలి’ రికార్డులు ఇంకా కొనసాగుతున్నాయి. దీనితో ఈరికార్డులను ‘ఆర్ ఆర్ ఆర్’ తో మళ్ళీ స్వయంగా రాజమౌళి బ్రేక్ చస్తాడు అన్న ఊహలు వచ్చాయి. అయితే ఇప్పుడు ‘ఆర్ ఆర్ ఆర్’ వల్ల టాలీవుడ్ ఫిలింఇండస్ట్రీకి 1000 కోట్ల నష్టం వచ్చింది అంటూ కొందరు ఒక కొత్త ప్రచారాన్ని మొదలుపెట్టారు.


‘ఆర్ ఆర్ ఆర్’ ప్లానింగ్ లో సమస్యలు మధ్యలో రామ్ చరణ్ కు గాయాలు ఆతరువాత ఈసినిమాకు సంబంధించి విదేశీ నటీనటులు ఎంపిక చేసుకునే విషయంలో తలెత్తిన సమస్యలతో పాటు ఇప్పుడు కరోనా సమస్యలు ఏకంకావడంతో ‘ఆర్ ఆర్ ఆర్’ ఎప్పుడు పూర్తి అవుతుందో రాజమౌళికే తెలియని పరిస్థితులు ఏర్పడటంతో ఇవ్వన్ని కలుపుకుని ప్రత్యక్షంగా పరోక్షంగా టాలీవుడ్ ఫిలింఇండస్ట్రీకి ‘ఆర్ ఆర్ ఆర్’ వల్ల 1000 కోట్ల నష్టం వచ్చింది అంటూ కొందరు చేస్తున్న విశ్లేషణల వెనుక కొన్ని ఆసక్తికర కారణాలు ఉన్నాయి. ‘ఆర్ ఆర్ ఆర్’ కారణంగా ఇండస్ట్రీ టాప్ హీరోలు రామ్ చరణ్ జూనియర్ లు రెండు మూడు సంవత్సరాల పాటు లాక్ అయిపోయారు. వీరిద్దరు ఇలా జక్కన్న దగ్గర బందీలుగా ఉండకపోయి ఉంటే ఈగ్యాప్ లో వీరిద్దరూ కనీసం ఒకొక్కరు రెండేసి సినిమాలు చేసి ఉండే వారు అన్నవాదన ఈ విశ్లేషకులు చేస్తున్నారు.


చరణ్ జూనియర్మార్కెట్ స్టామినాను బట్టి వారి సినిమాలకు ఒకొక్కదానికి కనీసం 150 నుంచి 200 కోట్ల టర్నోవర్ అయ్యే పరిస్థితులలో వీరిద్దరూ ఈగ్యాప్ లో చెరొక రెండు సినిమాలు చేసి ఉన్నా సుమారు 800 కోట్ల బిజినెస్ అయి ఉండేదని ఈవిశ్లేషకుల అంచనా. దీనికితోడు ప్రస్తుతం చరణ్ జూనియర్ లకు ఉన్న క్రేజ్ రీత్యా ఈహీరోల డేట్స్ కోసం వేచి ఉంటూ సినిమాలు చేయకుండా ఖాళీగా ఉన్న అనేకమంది టాప్ దర్శకుల సినిమాలు కూడ లెక్కలో వేసుకుంటే ‘ఆర్ ఆర్ ఆర్’ వల్ల పరోక్షంగా మరో నాలుగు వందల కోట్ల బిజినెస్ ఇండస్ట్రీ నష్టపోయిందని ఈవిశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఇలా ‘ఆర్ ఆర్ ఆర్’ ఆలస్యం వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా లెక్కలు వేసుకుంటే వేయి కోట్ల టర్నోవర్ టాలీవుడ్ కు నష్టం జరిగింది అంటూ వస్తున్న కామెంట్స్ రాజమౌళి దృష్టి వరకు వెళ్ళడంతో అతడు కూడ షాక్ అవుతున్నట్లు టాక్..

మరింత సమాచారం తెలుసుకోండి: