మెగాస్టార్ చిరంజీవి ప్రత్యక్ష రాజకీయాలకు స్వస్తి పలికి 'ఖైదీ నెంబర్ 150' సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్ర విజయం ఇచ్చిన ఊపుతో ‘సైరా నరసింహారెడ్డి’ లాంటి పాన్ ఇండియా మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని కొణెదల ప్రొడక్షన్స్ పై రామ్ చరణ్ మరియు మాట్నీ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో చందమామ కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. మెగాస్టార్ కెరీర్లో 152వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇండస్ట్రీలో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ మధ్య లీకైన చిరు లుక్ ఈ చిత్రంపై అంచనాలను పెంచేలా చేసింది.గత కొద్ది రోజులుగా శరవేగంగా జరుగుతున్న షూటింగ్ కరోనా వైరస్ ప్రభావం వలన వాయిదా పడింది. కాగా ఈ సినిమాలో రామ్ చరణ్ అతిధి పాత్రలో నటించాలని చిరంజీవి కోరుకున్నారు.

 

లాక్‌ డౌన్‌ కు ముందు చరణ్‌ ను సినిమా చేయడానికి అనుమతించడానికి రాజమౌళి అంగీకరించారు. అయితే లాక్ డౌన్ రెండు నెలల పాటు కొనసాగుతూ వస్తోంది. ఆర్.ఆర్.ఆర్ కూడా చాలా లేట్ అవుతుండటంతో షూట్ పూర్తి చేసే ఆత్రుతలో ఉంది. దీనితో రామ్‌ చరణ్‌ ను ఆచార్య చేయడానికి రాజమౌళి అనుమతించకపోవచ్చు అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాబట్టి షూటింగ్ ప్రారంభమైన తర్వాత 'ఆచార్య' జట్టుకు ఇది పెద్ద తలనొప్పి అవుతుంది. సంక్రాంతి విడుదల కోసం ఇంతకుముందు అనుకున్న ఆర్.ఆర్.ఆర్ ఇప్పటికే వాయిదా పడే అవకాశం ఉందని అంటున్నారు. అయినా రామ్ చరణ్ ని రాజమౌళి వదిలే అవకాశం కనిపించడం లేదు. షూటింగ్ ప్రారంభమైన తరువాత రాజమౌళి… చరణ్ అలియా భట్ ల కాంబినేషన్ సన్నివేశాలను చిత్రీకరించాల్సి ఉన్నందున 'ఆచార్య' బృందంతో రామ్ చరణ్ ను పంచుకోవడం కష్టమనే చెప్పాలి.

 

Alia Bhatt shares the first look of the most awaiting film ...

 

ఇప్పటికే లాక్ డౌన్ కారణంగా అలియా భట్ డేట్స్ మొత్తం వృథా అయిపోయాయి. ఇప్పుడు ఆమె డేట్స్ వేరే సినిమాలతో క్లాష్ వచ్చే అవకాశం ఉంది. దీనితో ఆమె ఎప్పుడు డేట్స్ ఇస్తే అప్పుడు ఆర్.ఆర్.ఆర్ బృందం షూట్ చేసుకోవాలి. ఈ తరుణంలో ఒక నెల పాటు రాజమౌళి రామ్ చరణ్ ని పంపడం అంత తేలికైన విషయం కాదు. కాబట్టి రామ్ చరణ్ 'ఆచార్య' చేస్తాడా లేదా అనేది ఈ బాలీవుడ్ నటి కేటాయించే డేట్స్ మీద ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని దసరా సందర్భంగా విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తోంది. లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత పరిణామాలను బట్టి సినిమా విడుదలపై క్లారిటీ రానుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: