రామ్ గోపాల్ వర్మ ఏది చేసినా సంచలనమే. మొదటి సినిమా శివ నుండీ మొదలుపెడితే ఇప్పటివరకూ అన్నీ సంచలనాత్మకమే. మొదట్లో తనలోని టాలెంట్ తో ప్రేక్షకులని మెస్మరైజ్ చేసిన వర్మ, ప్రస్తుతం వివాదాస్పద అంశాలని కథాంశాలుగా సినిమా తీస్తూ టాక్ ఆఫ్ ద టౌన్ అవుతున్నాడు. ప్రపంచంలో జరిగే పరిస్థితులని క్షుణ్ణంగా పరిశీలించే వర్మ వాటి మీద సినిమాలు తీస్తుంటాడు.

 

తాజాగా కరోనావైరస్ ప్రపంచాన్ని ఎంతలా బెంబేలెత్తిస్తుందో అందరికీ తెలిసిందే. ఈ మహమ్మారి నుండి ఎలా కాపాడుకోవాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ కరోనా మీద సినిమా తీశాడు. కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరికి కరోనా లక్షణాలు కనిపిస్తే ఇతర కుటుంబ సభ్యులు ఎలా రియాక్ట్ అవుతారు.. ఏ విధంగా కరోనా వైరస్ ప్రజల్ని భయపెడుతుంది అన్న నేపథ్యంలో సినిమా తీసినట్టు ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది.

 

అయితే ఈ సినిమాని రామ్ గోపాల్ వర్మ ప్రొడక్షన బ్యానర్ అయిన కంపెనీ నిర్మాణంలో తెరకెక్కించాడు. కానీ ఈ సినిమాకి దర్శకుడెవరనేది సస్పెన్స్ గా మారింది. టైటిల్ కార్డ్ లో ఏ రామ్ గోపాల్ వర్మ ఫిలిమ్ ఆఫ అగస్థ్య మంజు డైరెక్షన్ అని వేశారు. ఇదే ఇప్పుడు సమస్యగా మారింది. సాధారణంగా సినిమా పూర్తయ్యాక ఏ రామ్ గోపాల్ వర్మ ఫిలిమ్ అని చెప్పి డైరెక్టర్ పేరు వేస్తుంటారు. కానీ ఇక్కడ మాత్రం ఇద్దరి పేర్లు కనిపిస్తున్నాయి.

 

దీని గురించి ఒకానొక బాలీవుడ్ డైరెక్టర్ అడిగాడు కూడా. అయితే దానికి వర్మ సమాధానం చెబుతూ అలా అడగాలనే ఉద్దేశ్యంతోనే అలా వేశామని, మీరలా అడగదంతో మేమనుకున్నది సాధించామని చెప్పాడు. అయితే ఆ టైటిల్ కార్డ్ ప్రకారం సినిమాని రామ్ గోపాల్ వర్మ నిర్మాణంలో వచ్చిన అగస్థ్య మంజు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాగా భావించవచ్చేమో..

మరింత సమాచారం తెలుసుకోండి: