ట్రెండ్ కు తగినట్టుగా ఫాలో అవడం కామన్.. కరోనా లాక్ డౌన్ వల్ల సినిమాలు, టివి సీరియల్స్ ఆగిపోవడం వల్ల ఓటిటి ఫ్లాట్ ఫామ్ కు మంచి డిమాండ్ ఏర్పడింది. ఈ మూడు నెలల్లో లక్షల్లో సబ్ స్క్రైబర్స్, డౌన్స్ లోడ్స్ జరిగాయంటే నమ్మాల్సిందే. వన్ ఇయర్ నుండి వన్ మంత్ ప్లాన్స్ అందుబాటులో ఉండగా వాటిని తమ ప్లాన్ కు తగినట్టుగా చేసుకుంటూ వచ్చారు. ఇదిలాఉంటే ఇక ఇప్పుడు టాలీవుడ్ లో వెబ్ సీరీస్ ల ట్రెండ్ బాగా నడుస్తుంది. ఆహా ఓటిటిలో చాలా వెబ్ సీరీస్ లు రాబోతున్నాయని తెలుస్తుంది. 


ఇక ఇప్పుడు నిర్మాతలు కూడా కోట్లు పెట్టి సినిమా తీసే కన్నా లక్షల్లో వెబ్ సీరీస్ కానిచ్చి లాభాలు పొందాలని అనుకుంటున్నారు. కొద్దిగా అడల్ట్ కంటెంట్ ఉన్న వెబ్ సీరీస్ అయితే ఖర్చు తక్కువ లాభం ఎక్కువ అనే ఆలోచనలో ఉన్నారు. అయితే వీటి కోసం ఇప్పుడు నిర్మాతలు ప్లాప్ హీరోయిన్స్ వెంట పడుతున్నారు. అందం అభినయం ఉండి లక్ కలిసి రాక కెరియర్ లో వెనుకపడ్డ భామలను ఏరి ఇప్పుడు వెబ్ సీరీస్ లకు వాడేస్తున్నారు. వాళ్ళు కూడా వచ్చిందే అవకాశం అన్నట్టుగా రెచ్చిపోతున్నారు. 


ఇప్పటికే హెబ్భా పటేల్, పూజిత పొన్నాడ, ఈషా రెబ్బలు వెబ్ సీరీస్ లు చేస్తున్నారు. బుల్లితెర భామ రష్మితో కూడా వెబ్ సీరీస్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. డిమాండ్ ను బట్టే ప్రేక్షకులు కోరుతున్నవి ఇవ్వడమే దర్శక నిర్మాతల పని. అందుకే కొత్తగా టాలీవుడ్ లో వెబ్ సీరీస్ ల హవా మొదలైందని చెప్పొచ్చు. తెలుగు వెబ్ సీరీస్, వెబ్ మూవీస్ కు మంచి ప్రమోషన్స్ దొరుకుతున్నాయి. అందుకే అవి సూపర్ సక్సెస్ అవుతున్నాయి. ఇక రాను రాను వెబ్ మూవీస్ సినిమాలకు పోటీ ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని కొందరు అంటున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: