నాగార్జున... తండ్రి వారసత్వాన్ని అందుకుని స్టార్ హీరో గా ఒక వెలుగు వెలిగిన హీరో. అతి తక్కువ కాలంలో మంచి సినిమాలు చేయడమే కాదు వాటి తో మంచి హిట్స్ కొట్టి ఎవరికి అందని ఎత్తులో టాలీవుడ్ స్టార్ హీరో గా ఒక స్థాయిలో ప్రభావం చూపించారు. ఒక్క నటుడిగానే కాదు మంచి నిర్మాతగా కూడా ఆయనకు పేరు ఉంది అనేది అందరికి తెలుసు. తండ్రి స్టార్ హీరో అయినా సరే ఆయన సొంతగా పైకి వచ్చే ప్రయత్నం చేసారు గాని ఎక్కడా కూడా తండ్రి పేరు ని వాడుకుని పైకి రావాలి అని ఆయన ప్రయత్నం చేయలేదు అని చాలా మంది టాలీవుడ్ లో ఇప్పటికి కూడా అంటూ ఉంటారు. 

 

ఆయన సినిమాలు మంచి విజయం సాధించినా లేకపోయినా ఎక్కడా కూడా ఆయన భయపడే వారు కాదు అని చాలా మంది చెప్తారు. ఇక తండ్రి వారసత్వాన్ని అందుకున్న ఆయన చాలా వరకు కూడా టాలీవుడ్ లో తనకంటూ ఒక గుర్తింపు తోనే వెళ్ళారు. ఇక ఆయన చేసిన సినిమాలు ఆయనకు వచ్చిన పేరు అనేది పక్కన పెట్టి ఆయన  గురించి కొన్ని విషయాలు మాట్లాడితే... టాలీవుడ్ లో ఆయనకు చాలా ప్రాధాన్యత ఉంటుంది అనేది వాస్తవం. ఆయనకు చాలా విలువ ఉంటుంది. ఆయన మాటను ఎవరూ కూడా కాదు అనలేని విధంగా ఉంటుంది. 

 

ఆయన సినిమాలు అయినా  ఆయన మాట అయినా సరే ఎక్కడా ఎవరో కూడా తీసి పడేసే పరిస్థితి ఉండదు. ఇక ఆయన సినిమా విడుదల అవుతుంది అంటే చాలు థియేటర్ లు కూడా ఖాళీ లు చేసుకునే పరిస్థితి అప్పట్లో ఉండేది అని అంటూ ఉంటారు. ఆ విధంగా నాగార్జున తన ప్రభావం చూపించారు. ఆయన ఇప్పటికి కూడా అదే స్థాయిలో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: