కృష్ణ... టాలీవుడ్ లో అతి తక్కువ కాలంలో స్టార్ హీరో గా ఒక వెలుగు వెలిగిన నటుడు. ఆయన సినిమాలు ఆయన నటన ఆయనకు వచ్చిన పేరు గురించి ఎంత చెప్పినా ఏది చెప్పినా సరే తక్కువే అవుతుంది. ఆయనకు చాలా ప్రాదాన్యత మన తెలుగులో ఉంటుంది. ఏ స్టార్ హీరో కూడా చేయని విధంగా ఆయన అప్పట్లోనే ప్రయోగాలు చేసారు. నిర్మాతగా చాలా సినిమాలను నిర్మించారు. హీరోగా ఎన్నో సాహసాలు కూడా చేసారు. ఎంత స్టార్ ఇమేజ్ ఉన్న హీరో కూడా దాదాపుగా అలంటి సినిమాలు చేసిన సందర్భం అనేది టాలీవుడ్ లో లేదు అనే చెప్పాలి. ఆ విధంగా కృష్ణ తకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్నారు. 

 

ఇక ఆయనకు టాలీవుడ్ లో చాలా ప్రాధాన్యత ఉంటుంది అనేది అందరికి తెలిసిన  విషయమే. ఆయన మాటను కాదు అనే వారు ఎవరూ కూడా ఉండరు అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనను ఎవరూ కూడా తీసి పడేసే పరిస్థితి ముందు నుంచి కూడా ఎప్పుడు కూడా లేదు అని అంటూ ఉంటారు. ఆయన సినిమా విడుదల అవుతుంది అంటే కొందరు హీరోలు తమ సినిమాలను వాయిదా వేసుకున్న  రోజులు కూడా ఉండేవి అప్పట్లో అని అంటూ ఉంటారు. ఆ విధంగా కృష్ణ చాలా తక్కువ కాలంలో తన ప్రభావం చూపించారు. 

 

ఆయన సినిమాలకు ఏ స్థాయిలో గుర్తింపు వచ్చింది అంటే కృష్ణ సినిమాల కోసం బాలీవుడ్ ఎదురు చూసే విధంగా. అగ్ర హీరోగానే కాదు ఆయన నిర్మాతగా చేసిన సినిమాలకు కూడా మంచి గుర్తింపు ఉంటుంది. ఇప్పుడు అయినా సరే కృష్ణ చాలా మందికి కనపడే దైవం అని అంటారు జనాలు. ఆ విధంగా కృష్ణ టాలీవుడ్ లో తన మార్క్ దాదాపుగా చెరిగిపోని విధంగా వేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: