దాదాపు 13 భారతీయ భాషలలో 1000 సినిమాలను తన సొంత నిర్మాణ కేంద్ర తెరకెక్కించిన ఏకైక వ్యక్తిగా డాక్టర్ రామానాయుడు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు లో స్థానాన్ని సంపాదించుకున్నాడు. తాను 1936 జూన్ 6వ తేదీన ప్రకాశం జిల్లాలోని కారంచేడు గ్రామంలో దగ్గుబాటి వెంకటేశ్వర్లు లక్ష్మీదేవమ్మ లకు రామానాయుడు జన్మించాడు. అయితే తనకు తమ్ముడు పుట్టిన సమయంలో తమ్ముడు తో పాటు తన తల్లి కూడా చనిపోయారు. అప్పటికి రామానాయుడికి కేవలం మూడు సంవత్సరాల వయస్సు మాత్రమే ఉంది. ఆ వయసులో తన తల్లి చనిపోయిన విషయం కూడా రామానాయుడికి తెలియలేదు. ఇంత పిన్న వయసులో ఉన్న తన పిల్లలను పెంచి పెద్ద చేసేందుకు తండ్రి వెంకటేశ్వర్లు మరొక ఆమెను పెళ్లి చేసుకున్నాడు. 

 


అయితే ఆమె రామానాయుడని, తన అక్కా అమ్మాయిలను కూడా సొంత బిడ్డల్లా చూసుకునేది. దీని కారణంగా తనకు అమ్మ ప్రేమ దూరమయ్యింది అనే భావనే రాలేదట. కారం చెడు గ్రామంలో అందరూ ప్రేమ ఆప్యాయతలు చెప్పుకుంటూ ఓకే ఫ్యామిలీ గా ఉండేవారట అందుకే రామానాయుడులో ఎన్నో ఆప్యాయతలు ప్రేమలు పెరిగిపోయాయి. చిన్న తనంలోనే ఏదైనా మంచి పని చేసే గొప్ప పేరు తెచ్చుకోవాలని కుతూహలం రామానాయుడు లో ఎక్కువగా ఉండేది. ఆ క్రమంలోనే తన తొమ్మిదేళ్ల వయసులోనే రెండు ఎకరాల భూమిని పేద ప్రజలకు విరాళంగా ఇచ్చి అందరి చేత బాబు అనిపించాడు. అప్పటికే రామానాయుడు కుటుంబానికి వంద ఎకరాల భూమి ఉండేది. 

 

 

రామానాయుడు 1 నుండి ఐదవ తరగతి వరకు కారంచేడు లోనే చదువుకున్నారు ఆ తర్వాత ఒంగోలులో బాగా తెలిసిన బిబీఎల్ డాక్టర్ సూర్యనారాయణ ఇంట్లో ఉండి హై స్కూల్ విద్యను అభ్యసించాడు. ఆ సమయంలోనే తాను కూడా సూర్యనారాయణ లాగా డాక్టర్ కావాలనుకున్నాడు. సెలవు రోజుల్లో కాంపౌండర్ గా కూడా పని చేశాడు. ఆ తర్వాత మద్రాసు లయోలా కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదివి ఫెయిల్ అయ్యాడు. దాంతో తన తండ్రి చీరాల లోని ఒక కాలేజీలో చేర్పించారు చదివించ గా ఇంటర్ సెకండియర్ కూడా తప్పాడు. ఇక తనకి చదివించడం వేస్ట్ అనుకున్న తండ్రి ఇంటి దగ్గరే ఉండి వ్యవసాయం చేసుకోను అన్నాడు. తండ్రి మాట ప్రకారం ఇంటి దగ్గరే ఉండి వ్యవసాయ పనులు నేర్చుకొని కొంత కాలంలోనే నైపుణ్యం సంపాదించాడు. తర్వాత రైస్ మిల్లు స్థాపించి, ప్రైవేటు బస్సులను తిప్పి చాలా లాభాలను ఆర్జించాడు. ఆ తరువాత మేనమామ కూతురు రాజేశ్వరి ని పెళ్లి చేసుకున్నాడు. వీళ్ళిద్దరికీ సురేష్ వెంకటేష్ జన్మించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: