సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్లు సర్వ సాధారణం. కోట్లు పెట్టి సినిమా తీసే నిర్మాతలు సెంటిమెంట్ల విషయంలో చాలా ఖచ్చితంగా ఉంటారు. సినిమా అనేది వ్యాపారాత్మకమే కాబట్టి దర్శకులు కూడా ఏమీ అనడానికి ఉండదు. ఆ మాటకొస్తే దర్శకులకి, హీరోలకి కూడా సెంటిమెంట్లు ఉంటాయి. వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్న హీరోయిన్లకి అవకాశాలు ఈ సెంటిమెంట్ మూలంగానే. అదే విధంగా ఒక సినిమా ఫ్లాప్ అయిందంటే మళ్లీ అందులో నటించిన వాళ్లై తీసుకోవడానికి జంకుతుంటారు.

 

కొందరేమో కమెడియన్ ని ప్రతీ సినిమాలోనూ రిపీట్ చేస్తూ ఉంటారు. ఇలా ఒక్కొక్కరికీ ఒక్కో సెంటిమెంట్ ఉంటుది. అయితే ఇవన్నీ దర్శక నిర్మాతలు కోరు తెచ్చుకున్నవి. కొన్ని ఆపాదించిన సెంటిమెంట్లు కూడా ఉంటాయి. పవన్ కళ్యాణ్ కి అలాంటి సెంటిమెంట్ ఒకటి ఉంది. పవన్ కళ్యాణ్ కి హిట్ ఇచ్చిన దర్శకుడితో రెండవ సినిమా చేస్తే అది ఫ్లాపై కూర్చుంటుంది. ఇది చాలాసార్లు నిజమవుతూ వచ్చింది కూడా. సుస్వాగతం సినిమాతో హిట్ ఇచ్చిన భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన అన్నవరం ఫ్లాప్ అయింది.

 

అలాగే పూరి జగన్నాథ్ బద్రీ హిట్ కాగా, కెమెరామెన్ గంగతో రాంబాబు డిజాస్టర్ గా మిగిలింది. ఇంకా ఎస్ జే సూర్యతో ఖుషీ హిట్ అవ్వగా, ఆ తర్వాత పులి చిత్రం ఎంతటి నిరాశని మిగిల్చిందో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ సెంటిమెంట్ హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కే సినిమతో రిపీట్ అవుతుందేమోనని భయపడుతున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఇదివరకు వచ్చిన గబ్బర్ సింగ్ ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే.

 

దాంతో ఈ రెండవ చిత్రంపై అనవసర భయం నెలకొంది. అయితే పవన్ ఈ సెంటిమెంట్ ని బ్రేక్ చేసిన సందర్భం కూడా లేకపోలేదు. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన జల్సా హిట్ అనిపించుకున్నాక, అత్తారింటికి దారేది సినిమాతో వచ్చిన పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. మరి హరీష్ శంకర్ తో సినిమా విషయంలోనూ సెంటిమెంట్ ఇలాగే బ్రేక్ అవ్వాలని ఆశిద్దాం..

మరింత సమాచారం తెలుసుకోండి: