1936 నవంబర్ 16వ తేదీన వెంకట సుబ్బారావు, వెంకట సుబ్బమ్మ దంపతులకు కృష్ణా జిల్లా పెదపారుపూడి లో రామోజీరావు జన్మించాడు. రామోజీరావు తల్లిదండ్రులు వ్యవసాయం చేసేవారు. రామోజీరావు రామోజీరావు గ్రూప్ అనే సంస్థ ఏర్పాటు చేసి దాని కింద అనేకమైన కంపెనీలను ప్రారంభించారు. అందులో మార్గదర్శి చిట్ ఫండ్స్, ఈనాడు వార్తాపత్రిక ఈనాడు టెలివిజన్, రమాదేవి పబ్లిక్ స్కూల్, ప్రియా ఫుడ్స్, ఉషా కిరణ్ మూవీస్ తదితర కంపెనీలను ప్రారంభించాడు. వాటిల్లో మొట్టమొదటిగా మార్గదర్శి చిట్ ఫండ్ 1962వ సంవత్సరంలో స్థాపించబడగా... మూడు లక్షల 60 వేల మంది మధ్య తరగతి ప్రజలు ఆ చిట్ ఫండ్ సంస్థ ద్వారా ఆర్థికంగా లాభపడ్డారు. 

IHG's The Largest <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=RAMOJI FILM CITY' target='_blank' title='ramoji film city-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ramoji film city</a> In <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=HYDERABAD' target='_blank' title='hyderabad-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>hyderabad</a>, Interesting ...
అతనికి ప్రపంచంలోనే అతి పెద్ద సినిమా స్టూడియో హైదరాబాద్ నగరంలో ఉంది. రామోజీ ఫిలిం సిటీ గా పేరొందిన ఈ స్టూడియో లో అనేకమైన కార్యక్రమాలు సీరియల్లు, సినిమాల చిత్రీకరణలు, కచేరీలు, విహారయాత్రలు జరుగుతుంటాయి. స్క్రిప్ట్ చేతపట్టుకొని వస్తే సినిమా రామోజీ ఫిలిం సిటీ లోనే మొత్తం పూర్తి అవుతుందని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ రామోజీ ఫిలిం సిటీ గురించి గొప్పగా పొగిడింది. కేవలం ఆ స్టూడియో మీదే రామోజీరావుకి వేల కోట్లు లాభాలు వస్తాయి అంటే అతిశయోక్తి కాదు. 

IHG
1974 వ సంవత్సరం లో స్థాపించిన ఈనాడు వార్తాపత్రిక కూడా తెలుగు రాష్ట్రాల్లో నెంబర్ వన్ పత్రిక కొనసాగుతూ లాభాలనే ఆర్జిస్తోంది. 1995లో ప్రారంభించిన ఈటీవీ నెట్వర్క్ కూడా భారత దేశ వ్యాప్తంగా ప్రఖ్యాతిని గడించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డాల్ఫిన్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ లకు కూడా చైర్మన్ గా రామోజీరావు ఉన్నారు. అప్పట్లో ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ కింద అన్ని రకాల సినిమాలు తెరకెక్కే సూపర్ హిట్స్ గా నిలిచాయి. 2012వ సంవత్సరంలో రామోజీరావు చిన్న కుమారుడైన చెరుకూరి సుమన్ లుకేమియా వ్యాధితో చనిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: