తెలుగు వివాదాస్పద దర్శకుడు వర్మ అంటే తెలియని వాళ్ళు ఉండరేమో...ఎన్నో సినిమా లను విమర్శించడం... ఊరికే కారణం లేకుండా అందరి కీ రెచ్చి పోయే లా అయిందానికి కాని దానికి నోరు పారేసకోవడం..వర్మకు వెన్నతో పెట్టిన విద్య అన్న విషయం వేరేలా చెప్పన్నక్కర్లేదు.. అలా చేయడంతో వర్మ అందరి దృష్టిని ఆకర్షిస్తారు.. ఇకపోతే వర్మ తెరకెక్కించిన అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా విమర్శలు మూట కట్టుకున్న విషయం తెలిసిందే..

 

 

 


ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని తరిమి కొట్టే దిశగా ప్రజల్లో చైతన్యాన్ని కలిగిస్తున్నారు. పాటలతో, తన ప్రత్యేకమైన మాటలతో దూషిస్తూ సోషల్ మీడియా లో రాణిస్తున్నారు.. ఎప్పుడు వివాదాలకు కేరాఫ్ గా నిలిచిన సంగతి తెలిసిందే.. అయితే వర్మ సినిమాల కన్నా కూడా రూమర్లు తో వార్తలతో ఫేమస్ అవుతూ వస్తున్నారు..ప్రస్తుతం సినిమాల విషయానికొస్తే ఆయన బిజీగా ఉన్నారని తెలుస్తుంది.. 

 

 

 


వర్మ శిష్యుడు తెరకెక్కించి న బ్యూటిఫుల్ చిత్ర ప్రమోషన్లో భాగంగా వైజాగ్ వచ్చి ప్రెస్ మీట్ నిర్వహించారు వర్మ. దీనిలో భాగంగా ‘ఏమయ్యా వర్మా.. రాజధానిపై నీ అభిప్రాయం ఏంటి అని ఓ జర్నలిస్ట్ సోదరుడు అడిగిన ప్రశ్నకు వర్మ మార్క్ ఆన్సర్ వచ్చింది.హార్ట్ ఫుల్‌గా చెప్పాలంటే ఓటు అనే ఎఫెక్షన్‌తో ఏ పొలిటిషియన్ ఉండడు. ఒకవేళ అలా ఉంటే రాజధాని ఒక చోట కాదు.. నాయకులు, ప్రజలు ఉన్న ప్రతి చోట పెట్టాలి. పర్శన్‌కి అడ్మినిస్ట్రేషన్‌కి కనెక్షన్ ఉండాలనే వాదన కరెక్ట్ అయితే రాజధాని మూడు చోట్లే ఎందుకు ఉండాలి? మిగిలిన చోట్ల ఎందుకు ఉండకూడదు. ప్రతి ఊరిలోనూ క్యాపిటల్ ఉండాలి... అంటూ వర్మ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి..అందుకే వర్మ ఇప్పుడు బాగా ఫేమస్ అయ్యాడు..

మరింత సమాచారం తెలుసుకోండి: