కోలీవుడ్ స్టార్ హీరో సూర్య సతీమణి ,నటి జ్యోతిక ప్రధాన పాత్రలో నటించిన చిత్రం పోన్మగళ్ వందాల్. థియేటర్ విడుదలలేకుండానే ఈచిత్రం డైరెక్ట్ గా ఓటిటిలో విడుదలైంది. అమెజాన్ ప్రైమ్ ఈ సినిమా డిజిటల్ హక్కులను ఫాన్సీ రేటుకు దక్కించుకుంది. ఇక నిన్న ఈచిత్రాన్ని స్ట్రీమింగ్ లోకితీసుకురాగా ఈసినిమాకు,క్రిటిక్స్ నుండి పాజిటివ్ రివ్యూస్  వస్తున్నాయి.
 
కోర్టు డ్రామా గా తెరకెక్కిన ఈ చిత్రంలో జ్యోతిక ,లాయర్ గా కనిపించింది. ఈ సినిమాకు జ్యోతిక మెయిన్ పిల్లర్ గా నిలిచింది. లాయర్ పాత్రలో ఆమె నటన  హైలెట్ అయ్యింది. ఆమెతోపాటు భాగ్యరాజ్, పార్తీబన్  లు కూడా  సినిమాకు బాగా హెల్ప్ అయ్యారు. సాంకేతిక విభాగం పనితీరు కూడా బాగుంది. డైరెక్టర్ ఫెడ్రిక్ ఓ సున్నితమైన అంశాన్ని బాగా డీల్ చేశాడు. గోవింద్ వసంత సంగీతం, ఆంటోనీ ఎల్ రూబెన్, ఎడిటింగ్,రాంజీ ఛాయాగ్రహణం సినిమాకు ప్లస్అయ్యాయి. సొంత బ్యానర్ 2డి ఎంటెర్టైనెంట్స్ లో  సూర్య ఈ చిత్రాన్ని క్వాలిటీ తో నిర్మించాడు.  
 
ఇక ఇప్పట్లో థియేటర్లు తెరుచుకొనే పరిస్థితి లేకపోవడంతో మరి కొన్ని మీడియం రేంజ్ సినిమాలు  ఓటిటి లో విడుదలకురెడీ అవుతున్నాయి. ఒక్క తమిళలోనే కాకుండా మిగితా భాషల సినిమాలు  కూడా  ఓటిటి  లో విడుదలకానున్నాయి. అందులోభాగంగా హిందీ నుండి శకుంతలా దేవి, గులాబో సీతాబో, కన్నడ నుండి బిర్యానీ, లా మళయాలం మూవీ సోఫియామ్ సుజాతీయం తోపాటు తమిళం నుండి పెంగ్విన్ త్వరలోనే ప్రైమ్ లో విడుదలకానున్నాయి కాగా పెంగ్విన్ మాత్రం తమిళం తోపాటు తెలుగులోనూ విడుదలకానుంది అయితే తెలుగు నుండి మాత్రం ఇప్పటివరకు ఒక్క అమృత రామమ్ మాత్రమే ఓటిటి లో విడుదలైయింది. త్వరలోనే మరికొన్ని సినిమాలు డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: