తెలుగువాడి ఖ్యాతిని దేశం మొత్తం చాటి చెప్పిన మహోన్నత వ్యక్తిగా  తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా స్థానం సంపాదించుకునీ తెలుగు ప్రజలకు కారణ జన్ముడుగా మారారు నందమూరి  తారక రామారావు. ఒక సాదాసీదా వ్యక్తి గా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన నందమూరి తారకరామారావు మహోన్నత వ్యక్తిగా ఎదిగారు. ఎన్నో ఏళ్ల పాటు తెలుగు చిత్ర పరిశ్రమను నందమూరి తారక రామారావు శాశించారు అనడం లో అతిశయోక్తి లేదు. నందమూరి తారక రామారావు హీరోగా దర్శకుడిగా నిర్మాతగా సినీ పరిశ్రమలో తన ప్రస్థానాన్ని ఎంతో విజయవంతంగా కొనసాగించారు. ఇప్పటి వరకు ఎంత మంది హీరోలు వచ్చినా నందమూరి తారక రామారావు కి  వచ్చినంత ఖ్యాతి ఎవ్వరికీ రాలేదు అనడంలో అతిశయోక్తి లేదు. 

 


 ఇప్పటికీ తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు నందమూరి తారక రామారావు. తెలుగువాడి సత్తా ఏంటో దేశానికి చాటిచెప్పే విధంగా సినిమాలను ప్రభావితం చేశారు నందమూరి తారక రామారావు. కొన్ని దశాబ్దాల పాటు తెలుగు చిత్ర పరిశ్రమను ఏలిన వ్యక్తి నందమూరి తారక రామారావు. ముఖ్యంగా తెలుగు చిత్ర పరిశ్రమలో నందమూరి తారక రామారావు సినీ ప్రస్థానం... అద్భుతం మహా అద్భుతం అని చెప్పవచ్చు . చిత్ర పరిశ్రమపై అప్పట్లో ఉండే ఒక చెడు  భావనను తొలగించి చిత్ర పరిశ్రమలోని నటులు కూడా గొప్ప వ్యక్తులు ఉంటారు అని నిరూపించిన మహోన్నత వ్యక్తి నందమూరి తారక రామారావు. 

 

 ఇక ఆయన చేసిన సినిమాలతో... ఆయన నటన తో విశ్వ విఖ్యాత నట సార్వభౌమ అనే బిరుదు కూడా పొందారు నందమూరి తారక రామారావు. ముఖ్యంగా పౌరాణిక పాత్రల్లో నందమూరి తారక రామారావు నటనకి మంత్రముగ్ధులను అవ్వని తెలుగు ప్రేక్షకులు లేరంటే అతిశయోక్తి కాదు. ఎన్ని సంవత్సరాలైనా వెయిట్ చేస్తాము  కానీ తప్పక ఎన్టీఆర్ తో మాత్రం సినిమా తీస్తాము అని వేచి చూసిన దర్శకులు  ఎంతో మంది. అంతలా తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రభావితం చేశారు నందమూరి తారక రామారావు.. అందుకే ఎంత మంది హీరోలు వచ్చినా నందమూరి తారకరామారావు కి మాత్రం తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక అరుదైన గౌరవం ఉంటుంది .

మరింత సమాచారం తెలుసుకోండి: