తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ మాస్టర్. ఈసినిమా ట్రైలర్ కోసం అతని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అయితే ఏప్రిల్ లోనే ఈసినిమాను విడులచేద్దాం అనుకుని ట్రైలర్ ను ముందే కట్ చేసి పెట్టారు కానీ అంతలో కరోనా వల్ల లాక్ డౌన్ రావడంతో ట్రైలర్ ను విడుదలచేయడానికి చిత్ర బృందం ఆసక్తి చూపించలేదు. ఇక ఈట్రైలర్ ను విజయ్ బర్త్ డే సందర్భంగా జూన్ 22న విడుదలచేసి సినిమాను దీపావళికి విడుదలచేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 
 
ఇదిలాఉంటే ఈచిత్రంలో హీరోయిన్ గా నటించిన మాళవిక మోహనన్ ట్రైలర్ ను ముందే చూసేసిందట. తాజాగా మాస్టర్ ట్రైలర్ గురించి ఆమె స్పందించింది. ఆడియో లాంచ్ కోసంచెన్నైకి వచ్చినప్పుడు మరుసటి రోజు ఆఫీస్ కు వెళ్ళి మాస్టర్ ట్రైలర్ ను చూశాను.  ట్రైలర్ అంత మాస్ గా ఉండి గూస్ బాంబ్స్ వస్తాయని  వెల్లడించింది. విజయ్ ఫ్యాన్స్ కు అయితే ట్రైలర్ , ట్రీట్ లా ఉంటుందని మాళవిక చెప్పుకొచ్చింది.
 
కాలేజీ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ ఎంటర్టైనర్ గా ఖైదీ ఫేమ్ లోకేష్ కనకరాజ్ తెరకెక్కించిన ఈ చిత్రంలో విజయ్ సేతుపతి విలన్ గా నటించగా అర్జున్ దాస్ ,శంతన్ భాగ్యరాజ్ ,ఆండ్రియా జెర్మియా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ రవి చంద్రన్ సంగీతం అందించగా ఎక్స్ బి క్రియేటర్స్ పతాకం పై బ్రిట్టో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇక ఈసినిమా తెలుగులో కూడా విడుదలకానుంది. 9కోట్లకు మహేష్ ఎస్ కోనేరు మాస్టర్ తెలుగు వెర్షన్ హక్కులను దక్కించుకున్నాడు. తమిళ్ తోపాటు తెలుగు లోనూ ఒకేసారి భారీస్థాయిలో విడుదలకానుంది. కాగా ఈసినిమా డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ భారీ ధరకు సొంతం చేసుకుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: