ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో వారసులుగా వచ్చిన వాళ్ళు చాలా చాలామంది ఉన్నారు. ముఖ్యంగా మెగా ఫ్యామిలీ నుండి అయితే ఏకంగా అరడజను పైగా హీరోలు తెలుగు చిత్ర చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి దూసుకుపోతున్నారు. ఇక నందమూరి ఫ్యామిలీ నుంచి కూడా ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ ఎన్నో ఏళ్ల నుంచి హీరోలుగా కొనసాగుతున్నారు. మంచు వారి ఫ్యామిలీ నుంచి అక్కినేని ఫ్యామిలీ నుంచి.. ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి ఇలా అన్ని ఫ్యామిలీల నుంచి ఎంతో మంది హీరోలు తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఉన్న హీరోలు అందరూ చెప్పేది ఏమిటి అంటే సినీ బ్యాక్ గ్రౌండ్ ఉండడం తమకు కేవలం చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యేంతవరకు మాత్రమే పనికొస్తుందని ఆ తర్వాత హీరోగా ఎదగడానికి మాత్రం సొంత టాలెంట్తో కష్టపడాల్సి వచ్చింది అంటూ చెప్పుకొచ్చారు. 

 


 అయితే నందమూరి ఫ్యామిలీ నుంచి వారసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన జూనియర్ ఎన్టీఆర్ తాతకు తగ్గ మనవడిగా గుర్తింపు సంపాదించుకున్న విషయం తెలిసిందే. నటనలో డాన్స్ లో  యాక్షన్ లో ఇలా ప్రతీ విషయంలో ఎవరికీ సాధ్యం కాని రీతిలో ప్రత్యేక గుర్తింపు సంపాదించారు జూనియర్ ఎన్టీఆర్. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ ఎంతో మంది యువ హీరోలకు ఆదర్శంగా నిలిచారు. తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన జూనియర్ ఎన్టీఆర్... తాతకు తగ్గ మనవడిగా... అసలు సిసలైన నందమూరి వారసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమను  ప్రభావితం చేసి... నిలదొక్కుకున్న విషయం తెలిసిందే. 

 


 కేవలం ఒక హీరోగా మాత్రమే కాకుండా ఒక మంచి వ్యక్తిగా కూడా జూనియర్ ఎన్టీఆర్కు తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో గుర్తింపు ఉంది. అయితే ప్రస్తుతం తెలుగు చిత్రపరిశ్రమలో ఏ యువ  హీరో హీరో ని మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు అని అడిగితే ఠక్కున జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పేస్తారు. ఏ  సినీ ప్రేక్షకుడి అడిగినా ఇదే మాట వినిపిస్తోంది. ఎందుకంటే ఎన్నో వైవిధ్యమైన పాత్రలో నటించి తనదైన నటనతో టాలీవుడ్ ను  ఎంతగానో ప్రభావితం చేశారు జూనియర్ ఎన్టీఆర్. తనదైన నటనతో నటనకు నిలువెత్తు రూపంగా నిలిచిన  మారిపోయారు జూనియర్ ఎన్టీఆర్. అందుకే టాలీవుడ్ లో ఎంత మంది హీరోలు ఉన్నా జూనియర్ ఎన్టీఆర్ కు ఒక ప్రత్యేక ఇమేజ్ ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: