తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పటి వరకు ఎంతో మంది సంగీత దర్శకులు తమ దైన సంగీతం తో ప్రేక్షకులను  మైమరపింప  చేసి ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్న విషయం తెలిసిందే. ఇలా ప్రేక్షకులను ఎంతగానో ప్రభావితం చేస్తూ దాదాపుగా గత దశాబ్ద కాలం నుంచి తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్గా కొనసాగుతూ... విభిన్నమైన మ్యూజిక్ తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు కీరవాణి. ఏదైనా సినిమాకు కీరవాణి సంగీతం అందించారు అంటే... ఆ మ్యూజిక్ లో ఏదో మ్యాజిక్ ఉంటుంది అని ప్రేక్షకులు భావిస్తూ ఉంటారు. అందుకే ప్రతి సినిమాలో కీరవాణి మ్యూజిక్ బాగా క్లిక్  అవుతూ ఉంటుంది. 

 


 ఇప్పటినుంచి కాదు దాదాపుగా గత దశాబ్ద కాలానికి పైగా కీరవాణి తెలుగు చిత్ర పరిశ్రమలో తన సంగీతంతో ఎంతగానో ప్రభావితం చేస్తున్నారు. అద్భుత మైన మెలోడీ సాంగ్స్ ని కంపోజ్ చేయడంలో కీరవాణికి ఎవరు సాటి లేరు నేటితరంలో అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కీరవాణి కంపోజ్ చేసిన మెలోడీ సాంగ్స్ వింటుంటే ఎంతో వినసొంపుగా ఉంటాయి. అంతేకాకుండా ఎమోషనల్ సాంగ్స్ విషయంలో కూడా కీరవాణి ప్రేక్షకులకు కన్నీరు పెట్టిస్తుంటాడు. కీరవాణి అందించిన ఏవైనా ఎమోషనల్ సాంగ్స్ విన్నాము అంటే... వింటున్న ప్రేక్షకుడి కళ్ళలో నుంచి కన్నీరు రాకమానదు. అంతలా ప్రభావితం చేస్తాయి కీరవాణి సాంగ్స్. 

 

 కేవలం తన తమ్ముడు రాజమౌళి దర్శకత్వం వహించిన సినిమాల్లో మాత్రమే కాకుండా ఎన్నో మిగతా సినిమాల్లో కూడా సంగీత దర్శకుడిగా పనిచేసిన కీరవాణి తన అద్భుతమైన సంగీతం తో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. ఇక కీరవాణి సంగీతం అందిస్తున్నారు అంటే ఆ సినిమాకి ఆ సంగీతమే వెన్నుముకగా మారిపోతుంది అన్నది ప్రేక్షకుడి భావన. ఇలా సినిమాలలో తన సంగీతంతో ఎంతగానో ప్రభావితం చేస్తూ దశాబ్ద కాలానికి పైగా తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్గా కొనసాగుతూ... ఎంతో వినసొంపైన అద్భుతమైన సంగీతం తో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నారు సంగీత దర్శకుడు కీరవాణి.

మరింత సమాచారం తెలుసుకోండి: