నేటితరం దర్శకుల్లో ఎంతోమంది సినీపరిశ్రమలో తనదైన దర్శకత్వం నైపుణ్యంతో ఎంతగానో ప్రభావితం చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా కొంతమంది దర్శకులు తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక ట్రెండ్ సెట్టర్ గా మారిపోయారు. ఇలా తెలుగు చిత్ర పరిశ్రమలో సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన వాళ్లలో ముందు వరుసలో ఉంటారు త్రివిక్రమ్. మాటలతో మాయ చేసి... సినిమా చూస్తున్న ప్రేక్షకులకు ఫుల్  టైం ఎంటర్టైన్ మెంట్  అందిస్తుంటారు . అంతేకాకుండా పేజీలు పేజీలు డైలాగులకు చరమగీతం పాడింది కూడా త్రివిక్రమ్ అనడంలో అతిశయోక్తి లేదు. ఒకప్పుడు పేజీలకు పేజీలు డైలాగులను  చెప్పేవారు... అయితే ప్రేక్షకులను అలరించడానికి.. సినిమాను నడిపించడానికి  పేజీలు పేజీలు డైలాగులు అవసరం లేదు పవర్ ఫుల్ పంచ్ డైలాగులు కొన్ని ఉంటే చాలు సిరిమాను నడిపించవచ్చు అని నిరూపించి అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు. 

 

 ముఖ్యంగా త్రివిక్రమ్ కలం నుంచి జాలువారిన ఎన్నో అద్భుతమైన డైలాగ్ లు ఎంతో మంది యూత్ కి ఆదర్శప్రాయంగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా త్రివిక్రమ్ సినిమాల్లో  హీరోలు చెప్పే డైలాగులు... నిజజీవితానికి దగ్గరగా.. వాస్తవికతను సూచించే విధంగా ఉంది. మానవత్వ విలువలను గుర్తు చేస్తూ ఉంటాయి... ఒక మనిషి ఎలా బ్రతకాలి అనేది చెప్పకనే చెబుతుంటాయి త్రివిక్రమ్ డైలాగులు. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగులు తెలుగు ప్రేక్షకులందరిని  ఎంతగానో ప్రభావితం చేస్తూ ఉంటాయి. అందుకే త్రివిక్రమ్ తన సినిమాలలో కేవలం పంచు డైలాగ్ లతోనే మాయ చేస్తూ ఉంటాడు అంటున్నారు ప్రేక్షకులు. అందుకే త్రివిక్రమ్ ను  మాటల మాంత్రికుడు అని కూడా చెబుతుంటారు. 

 


 ముఖ్యంగా త్రివిక్రమ్ సినిమాలలోని డైలాగుల గురించి అయితే ఎంత చెప్పినా తక్కువే... త్రివిక్రమ్ డైలాగ్ లు అన్ని ఊహకందని విధంగా... ఉంటాయి.. ఇక ఈ డైలాగులు విని చాలా మంది ప్రేక్షకుల్లో  కూడా మార్పు వచ్చింది అనటంలో  అతిశయోక్తి లేదు. అందుకే ఎంత మంది కొత్త దర్శకులు వచ్చిన ఎలాంటి సినిమాలను తెరకెక్కించిన త్రివిక్రమ్ శ్రీనివాస్ కు  మాత్రం ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది తెలుగు చిత్ర పరిశ్రమలో. ఇక ఎన్నో ఏళ్ల పాటు తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక ట్రెండ్ సెట్టర్ గా మారిన త్రివిక్రమ్ స్టార్ డైరెక్టర్గా దూసుకుపోతున్నారు. తనకు తిరుగు లేదు అని నిరూపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: