టాలీవుడ్ లో అందరూ కలిసి ఉన్నారా విడిపోయారా...? ఇప్పుడు దీనిపై పెద్ద చర్చలే జరుగుతున్నాయి. నందమూరి కుటుంబం ఇప్పుడు అసహనంగా ఉంది టాలీవుడ్ లో. అయితే ఇప్పుడు కొందరు టాలీవుడ్ లో రెండు వర్గాలు ఉన్నాయి అని కొన్ని సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. బాలకృష్ణ ను దూరం పెడుతున్నారు అనేది నిన్నటి నుంచి ఎక్కువగా వినపడుతున్న వార్త. అయితే ఇప్పుడు నందమూరి కుటుంబం వర్సెస్ ఇతరులు అన్నట్టు పరిస్థితి మారింది అనేది చాలా మంది చెప్తున్నారు. ఇప్పుడు టాలీవుడ్ లో నందమూరి వర్గం అనేది ఒకటి బయటకు వస్తుంది అని అంటున్నారు. 

 

చాలా మంది దర్శకులు నిర్మాతలు ఇప్పుడు దూరం అయ్యే అవకాశం ఉంది నందమూరి కుటుంబానికి  అని అంటున్నారు. బాలకృష్ణ వ్యాఖ్యలు కొంత మందికి బాగా ఇబ్బందిగా మారాయని ఏదైనా ఉంటే లోపల తేల్చుకోవాలి గాని ఆయన అలా అనడం చాలా వరకు కరెక్ట్ కాదు అని కొందరు అంటున్నారు. టాలీవుడ్ లో ఈ పరిణామం అసలు మంచిది కాదు అని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా సమస్య వచ్చింది అనుకున్నప్పుడు అందరూ కలిసి కూర్చుని మాట్లాడుకుంటే ఇంత లా ఉండదు అని కాబట్టి పెద్దలుగా ఉన్న వాళ్ళు అర్ధం చేసుకోవాలి అంటున్నారు. 

 

దీని కారణంగా చిన్న హీరోలు ఇబ్బంది పడే అవకాశం ఉందని ఇతర నటులు కూడా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయని కాబట్టి ఎవరు అయితే పెద్దలుగా ఉన్నారో వాళ్ళు చాలా వరకు జాగ్రత్తలు తీసుకుని ప్రవర్తించాలి అని అంటున్నారు. ఇక సినిమా సమస్యల్లో ఉన్నప్పుడు అందరూ కలుపుకుని వెళ్ళాలి అని అంతే గాని సొంత పెత్తనాలు చేయడం ఎంత వరకు మంచిది కాదు అనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. మరి దీనికి ఎప్పుడు ముగింపు పలుకుతారు అనేది చూడాల్సి ఉంది. ఏమవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: