టాలీవుడ్ లో నందమూరి కుటుంబానికి ఉన్న పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన  అవసరం లేదు. దశాబ్దాలు గా ఆ కుటుంబం టాలీవుడ్ లో తన ప్రభావం చూపిస్తుంది ఎన్టీఆర్ ఉన్న నాటి నుంచి నేటి వరకు కూడా దాదాపుగా అదే పరిస్థితి ఉంది అని చెప్పవచ్చు. ఇక మన తెలుగులో చాలా మంది దర్శక నిర్మాతలు కూడా వారితో సినిమాలు చేయడానికి అలాగే వారి తో మంచి సంబంధాలు ఉండటానికే ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. వారికి ఆ రేంజ్ లో మన తెలుగులో ప్రాధాన్యత ఉంది. అయితే ఇప్పుడు వారి ప్రాధాన్యత తగ్గింది అని అంటున్నారు. 

 

సిని పెద్దల్లో కొందరు  వారిని పట్టించుకోవడం లేదు అనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి. నిన్న బాలకృష్ణ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసారు. ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. ఒక మంత్రిని లక్ష్యంగా చేసుకుని ఆయన ఈ వ్యాఖ్యలు చేసారు. ఇక అందులో స్టార్ హీరో లు కూడా ఉన్న సంగతి తెలిసిందే. ఆయన ఆ వ్యాఖ్యలు చేయడం చూసి చాలా మంది షాక్ అయ్యారు కూడా. టాలీవుడ్ లో వారిని దూరం పెడుతున్నారు అని మరి కొందరు అంటున్నారు. దీనికి కారణం ఏంటీ అనేది తెలియడం లేదు. 

 

ఇప్పుడు బాలకృష్ణ ఆ వ్యాఖ్యలు చేయడం వెనుక పెద్ద అర్ధమే ఉంది అనేది టాలీవుడ్ జనాల మాట. ఆయనను కొందరు దూరం పెడుతున్నారు అని పరోక్షంగా చెప్పారు. వ్యాపారాల కోసం వాళ్ళు ఆయనను దూరం పెడుతున్నారా అసలు టాలీవుడ్ లో ఇప్పుడు ఏది జరుగుతుంది అనేది ఎవరికి కూడా అర్ధం కాని పరిస్థితి నెలకొంది. మరి దీని పై ఎప్పుడు స్పష్టత వస్తుందో గాని బాలకృష్ణ వ్యాఖ్యలు మాత్రం పెద్ద దుమారం రేపాయి అనేది వాస్తవం. మరి ఎప్పుడు చల్లారుతుందో చూడాలి ఈ వ్యవహారం.

మరింత సమాచారం తెలుసుకోండి: