మా అంటే తెలుగు సినిమా తారల సంఘం. అక్కడ జూనియర్ సీనియర్ ఆర్టిస్టులు అంతా ఉంటారు. దాదాపుగా ఏడెనిమిది వందల మందితో సభ్యత్వం ఉంది. దానికి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం మా ప్రెసిడెంట్ గా నరేష్ ఉన్నారు. మరి మా ఇపుడు యాక్టివ్ గా ఉందా అన్న డౌట్లు వస్తున్నాయి.

 

నిజానికి మా ని ఏనాడో పక్కన పెట్టేశారని అంటున్నారు. మాను అలా ఉంచేసి ఇపుడు కొంతమంది సీనియర్ హీరోలు తమ చేతుల్లోకి సినిమా పరిశ్రమను తీసుకున్నారని విమర్శలు వస్తున్నాయి. ఇక తెలుగు సినిమా చాంబర్లు, భవనాలు ఉండగా ఇళ్లలో మీటింగులు పెట్టడం కూడా ఇంతవరకూ లేని సంప్రదాయమేనని అంటున్నారు.

 

ఇలా సొంత ఇమేజ్ పెంచుకోవడం కోసం కొంతమంది నటులు హఠాత్తుగా నేతల అవతారం ఎత్తేశార‌ని అంటున్నారు. నిజానికి అలాంటి ఉబలాటం ఉంటే మా నుంచి పోటీ చేసి ప్రెసిడెంట్ గా గెలిస్తే బాగుంటుంది అన్న మాట కూడా ఉంది. ప్రస్తుతం మా కార్యవర్గం ఉంది. అలా ఒక బాడీ ఉండగా దాన్ని కాదని, చాంబర్ ఆఫ్ తెలుగు సినిమాను కూడా పక్కకు నెట్టి వ్యక్తులు టాలీవుడ్ ని శాసించడం మొదలుపెడితేనే ఇగోలు క్లాషేస్ వస్తాయని కూడా అంటున్నారు.

 

తెలుగు సినిమా హీరోల మధ్య విభేధాలు లేవని అంతా అంటారు. కానీ ఉన్నాయని ప్రతీ సందర్భంలోనూ నిజమవుతోంది. కొంతమంది  హీరోలు వారి బిజినెస్ లను కాపాడుకోవడానికి ప్రభుత్వ పెద్దలకు సన్నిహితంగా మసలుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇక సినీ నటుడు బాలక్రిష్ణ చేసిన రియల్ ఎస్టేట్ వ్యవహారాలు, భూములు కూడా చాలామంది చేస్తున్న సంగతేనని అంటున్నారు.

 

ఇవన్నీ చూశాక రియల్ లైఫ్ లో రాజకీయం కంటే కూడా ఎన్నో ట్విస్టులు మలుపులు సినీ రంగంలో ఉందని అంటున్నారు. ఏది ఏమైనా కూడా కరోనా విరాళాల సాయంలో కూడా గడుసుదనం చూపిన కొంతమంది నటులు ఇపుడు ఏపీ సర్కార్ నుంచి సినిమా  సాయం అడగడంపైన చర్చ సాగుతోంది.

 

విభజన తరువాత ఏపీ ఆపదలో కష్టాల్లో ఉందని ఎక్కడో హైదరాబాద్ లో కూర్చుని అక్కడే పన్నులు కట్టే వారికి ఏపీ సర్కార్ అంత ఉదారత చూపించాల్సిన అవసరం లేదన్న మాట కూడా ఉంది. ఏపీ ఇబ్బందులను పట్టించుకున్న  వారికే సాయం చేయడం మంచిదని అంటున్నారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: