టాలీవుడ్ ఇండస్ట్రీలో అరుంధతి సినిమాలో విలన్ పాత్రలో ‘వదలనే బొమ్మాలి’ డైలాగ్ వింటే చాలు మనకి సోనుసూద్ గుర్తుకొచ్చేస్తాడు. ఆ సినిమాలో సోనూసూద్ పోషించిన పాత్ర ఎప్పటికీ సినిమా చూసిన ప్రేక్షకుడికి కళ్ళ ముందు కదలడతాడు. సిల్వర్ స్క్రీన్ పై విలన్ పాత్రలు పోషించిన సోనుసూద్ నిజ జీవితంలో మాత్రం హీరో అనిపించుకుంటున్నాడు. కరోనా వైరస్ రూపంలో అందరికీ కష్టకాలం వచ్చింది. లాక్ డౌన్ తో జనం ఇబ్బంది పడ్డారు. వలస కూలీలు ఉపాధి కోల్పోయారు. గత్యంతరం లేని పరిస్థితిలో స్వస్థలాలకు కాలినడకన బయలు దేరారు. రవాణా సదుపాయాలు లేకపోవడం వల్ల వందల కిలోమీటర్లు నడుస్తూ వలస కార్మికులు దేశవ్యాప్తంగా అనేక కష్టాలు పడటం అందరికీ తెలిసిందే.IHG

ఈ సమయంలో తన సొంత ఖర్చులతో వలస కార్మికులకు మొన్నటి వరకు నటుడు సోనుసూద్ సొంత ఊళ్లకు చేరుస్తూ ప్రత్యేకమైన బస్సులు ఏర్పాట్లు చేసి వాళ్ల బాధను తీర్చాడు. దీంతో చాలా మంది వలస కూలీలు సోనుసూద్ చేసిన సహాయానికి కృతజ్ఞతలు తెలిపారు. కాని ఈ విషయంలో ఒక వలసకూలీ చేసిన పనికి కంటతడి పెట్టుకున్నాడు సోనుసూద్. పూర్తి మేటర్ లోకి వెళ్తే సోనూసూద్ కేటాయించిన బస్సుల్లో ఇంటికి చేరుకున్న వలస కార్మికురాలు తనకు పుట్టిన బిడ్డకు సోనుసూద్ అని నామకరణము చేసింది.

IHG

ఈ విషయాన్ని స్వయంగా నటుడు సోనుసూద్ వెల్లడించారు. ఓ మహిళ ఇలా చేసింది అని, పేరు తర్వాత తన ఆమె ఇంటి పేరు శ్రీ వాస్తవ తో మొత్తం సోను సూద్ శ్రీవాస్తవ అని అన్నారు. అయితే ఈ సంఘటన తన మనసుకు హత్తుకుంది అని కంటతడి పెట్టించింది అని సోషల్ మీడియాలో తెలిపారు. దీంతో కరోనా వైరస్ కష్టకాలంలో సోనుసూద్ చేసిన సహాయం పట్ల సోషల్ మీడియాలో నెటిజన్లకి మరింత గౌరవం ఆయనకు తెచ్చిపెట్టినట్లు అయింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: