టాలీవుడ్ లో ఒక వెలుగు వెలిగిన హీరోయిన్ శృతి హాసన్. స్టార్ హీరో గా టాలీవుడ్ లో కి వచ్చిన ఈ భామ తక్కువ కాలంలో మంచి సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక  గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే సినిమా చేసినా చేయకపోయినా సరే ఆమె గురించి వార్తలు మాత్రం టాలీవుడ్ లో చాలానే మనం వింటూ ఉంటాం. ఏదోక వార్త ఎప్పుడు కూడా వస్తూనే ఉంటుంది అనేది వాస్తవం. ఇప్పుడు ఆమె తెలుగులో సినిమాలను చేయడానికి గానూ ప్రయత్నాలు చేస్తుంది. అవి ఎంతవరకు ఆమెకు అనుకూలిస్తాయో తెలియదు గాని... 

 

ఇప్పుడు మాత్రం ఆమెకు మంచి ఆఫర్లు వచ్చాయి అనేది వాస్తవం. ఇప్పుడు ఆమె మూడు సినిమాల్లో నటిస్తున్నారు. ఈ మూడు సినిమాలు కూడా వచ్చే ఏడాది రానున్నాయి. ఇక మూడు సినిమాలు కూడా టాలీవుడ్ లో అగ్ర హీరోల సినిమాలే అనే సంగతి తెలిసిందే. ఒకటి పవన్ కళ్యాణ్ సినిమా కాగా మరొకటి రవి తేజా సినిమా. ఇక మహేష్ బాబు తో కూడా ఆమె సినిమా చేసే అవకాశం ఉందని టాలీవుడ్ జనాలు అంటున్నారు. మహేష్ బాబు ఆమెకు హీరోయిన్ గా ఆఫర్ ఇచ్చాడు అని టాలీవుడ్ లో ఇప్పుడు పెద్ద చర్చలే జరుగుతున్నాయి. 

 

ఆమె సినిమాల గురించి ఇప్పుడు తన తండ్రి కూడా చాలా వరకు ఆవేదన గా ఉన్నారని ఆమెకు మంచి ప్రాజెక్ట్ లను ఇప్పించడానికి ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు అని సమాచారం. నిజం ఎంత అనేది పక్కన పెడితే ఇప్పుడు మాత్రం దీనికి సంబంధించిన చర్చలు అయితే జరుగుతున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్ లో ఆమె చేస్తున్న సినిమాలు అన్నీ కూడా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడ్డాయి. పవన్ సినిమాలో ఆమె పాత్ర చాలా కీలకం అని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: