మన తెలుగులో చాలా వరకు ఇప్పుడు సినిమాలను చాలా జాగ్రత్తగా తీస్తున్నారు. గతంలో మాదిరిగా హడావుడి గా సినిమాలను చేసే పరిస్థితి లేదు అనే విషయం అర్ధమవుతుంది. ఏ సినిమా అయినా సరే ఒకటికి పది సార్లు ఆలోచించి చేసే అవకాశం ఉంది అనేది వాస్తవం. దాదాపు ఇప్పుడు అగ్ర హీరోల సినిమాలు అయినా చిన్న హీరోల సినిమాలు అయినా సరే చాలా వరకు ఆలోచిస్తున్నారు. ఇక ఇప్పుడు నిర్మాతలు చాలా వరకు భయపడిపోయే పరిస్థితి ఉందని సమాచారం. కారణం ఏంటీ అనేది తెలియదు గాని ఇటీవల ఒక నిర్మాత కన్నీరు పెట్టే పరిస్థితి వచ్చింది అని అంటున్నారు. 

 

ఒక స్టార్ హీరో ని కలిసిన సదరు నిర్మాత తనను ఆర్ధికంగా ఆదుకోవాలి అని లేకపోతే తాను ఇప్పుడు ఏదొకటి చేసుకునే పరిస్థితిలో ఉన్నాను అని తాను మూడు సినిమాలకు ముందుగా డబ్బులు ఇచ్చా అని ఇప్పుడు తనకు అండగా ఉండాలి అని కోరినట్టు వార్తలు వస్తున్నాయి. దీనికి స్టార్ హీరో నుంచి  కూడా మంచి స్పందన వచ్చింది అని సమాచారం. సినిమా చేద్దామని దానికి నేను అండగా ఉంటా అని పెట్టుబడి నేను సహాయం చేస్తా అని చెప్పారట. 

 

అదే విధంగా  పారితోషికం తీసుకునే విషయంలో కూడా తన నుంచి ఏ విధమైన ఇబ్బంది ఉండదు అని నిర్మాత కు హామీ కూడా ఇచ్చారు అని సమాచారం. నిజం ఎంత అనేది తెలియదు గాని ఈ సినిమా మాత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్ళే అవకాశం ఉందని అంటున్నారు. ప్రస్తుతం ఆ నిర్మాత చేసేది రెండు హీరోలతో అని ఆ హీరోలు కూడా ఆయనను పెద్దగా ఆదుకోలేదు అని సమాచారం. మరి నిజం ఎంత అనేది తెలియదు గాని ఈ హీరో మాత్రం తన వంతు గా సహకారం అందించారట మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: