ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా అనగానే ఒక రేంజ్ లో క్రేజ్ ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ మొదలవుతుంది అని తెలిసిన నాటి  నుంచి కూడా దానికి ఇచ్చే ప్రాధాన్యత అంత  ఇంతా కాదు. దానికి సంబంధించిన ఏ వార్త వచ్చినా సరే జనాలకు ఒక రకంగా తెలియని క్రేజ్ అనేది ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ ఇంకా సెట్స్ మీదకు వెళ్ళలేదు. సెట్స్ మీదకు వెళ్లకపోయినా సరే జనాలు మాత్రం ఒక రేంజ్ లో ఈ సినిమా గురించి చర్చలు చేస్తున్నారు అనేది వాస్తవం. ఈ సినిమాలో నటులు ఎవరు కథ ఏ విధంగా ఉంటుంది అనేది ఇప్పుడు జనాలకు ఉండే ఆసక్తి అని చెప్పవచ్చు. 

 

ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా లో ఒక కీలక పాత్ర కోసం ఒక యువ నటుడ్ని తీసుకునే అవకాశం ఉందని టాలీవుడ్ జనాలు అంటున్నారు. అవును ఈ సినిమాలో రానా ని తీసుకునే అవకాశం ఉందని ఈ సినిమాలో రానా ఒక కీలక పాత్ర చేస్తాడు అని అది కేవలం పావు గంట మాత్రమే ఉండే పాత్ర అని టాలీవుడ్ జనాలు అంటున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ఇంకా సెట్స్ మీదకు వెళ్ళలేదు. ఎన్టీఆర్ ఫ్రీ అయిన తర్వాతః ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళే అవకాశం ఉంది. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళే సూచనలు ఉన్నాయి. 

 

ఈ సినిమాలో ఎన్టీఆర్ రాజకీయ నాయకుడిగా నటించే అవకాశం ఉందని సమాచారం. ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రకు సంబంధించి ఇప్పుడు దర్శకుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు పాత్ర ఎంత బాగుంటే సినిమా ఆ స్థాయిలో విజయం సాధిస్తుంది. అందుకే ఇప్పుడు త్రివిక్రమ్ ఒకటికి వంద సార్లు ఆలోచన చేసి... ఆ పాత్ర విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారట. మరి ఎలా ఉంటుందో.

మరింత సమాచారం తెలుసుకోండి: