నందమూరి తారక రామారావు,..తెలుగు వెలుగు. తెలుగు సినిమా ఈ రోజు ఈ విధంగా ఉందంటే దానికి ఆయనే ప్రధాన కారకులు. అసలు సినిమా వారికి గౌరవం, మర్యాద, మన్నన తెచ్చిన మహానుభావుడు. ఆయన దేవుడిగా జనంలో నిలిచారు. రంగు పూసుకున్న వాడు రాజకీయాలకు పనికిరారు అన్నపుడు అది తప్పు అని నిరూపించడమే కాదు. దేశాన్నే కదిలించగలరని నిరూపించారు.
ఆయన వారసులుగా రెండవ తరంలో బాలక్రిష్ణ, మూడవ తరంలో జూనియర్ ఎన్టీయార్ బలమైన ముద్ర వేసుకున్నారు. ఇద్దరూ మాస్ హీరోలే, ఇద్దరూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కల హీరోలే. నిజానికి ఇంత మాస్ కలిగిన ఇద్దరు హీరోలు ఉండి కూడా నందమూరి క్యాంప్ టాలీవుడ్ లో వెలవెలపోవడం బాధాకరమే.
మరో వైపు పెద్దగా హిట్లు లేని హీరోలు కూడా టాలీవుడ్ ని శాసిస్తూంటే చరిత్ర కలిగిన నందమూరి కుటుంబానికి చెందిన హీరోలు ఇతరుల రాజకీయాలకు బలి అవుతూ సైడ్ అవడం అభిమానులకే కాదు, అన్న గారి అఖండమైన ఫ్యాన్స్ కి కూడా ఆవేదన కలిగించే విషయం.
నిజానికి ఇదంతా ఎందుకు బాలయ్య, జూనియర్ చేతులు కలిపితే మొత్తానికి మొత్తం టాలీవుడ్ ఈ వైపుగానే చూస్తుంది. ఈ ఇద్దరూ మేము ఒక్కటి అనిపించేలా మూవీస్ కూడా కల్సి చేస్తే కొత్త కధలతో గట్టి సినిమాలే కాదు, పాన్ ఇండియా మూవీస్ వస్తాయి.
అంతే కాదు, టాలీవుడ్ ని శాసిద్దామనుకుంటున్న వారికి కూడా నందమూరి క్యాంప్ గట్టి జవాబు చెప్పగలుతుంది. చిత్రమేంటంటే బాలయ్య రాజకీయాల్లో ఎమ్మెల్యేగా కొనసాగుతున్నా ఆయనకు రాజకీయాలు అంతగా వంటబట్టలేదు. ఇక జూనియర్ కూడా అతి మంచితనం వల్ల అలా ఒంటరి పోరాటం చేస్తున్నారు.
ఇకనైనా ఈ ఇద్దరు హీరోలు కలవాలని, ఒకరు పిలవలేదు అన్న బాధ నుంచి నందమూరి క్యాంప్ నుంచే మిగిలిన వారికి ఆహ్వానాలు వెళ్ళే స్థాయికి కమాండ్ టాలీవుడ్లో సంపాదించాలంటే నందమూరి వారసులు అంతా ఒక్కటిగా నిలవాలి. ఒక్కటిగా కనబడాలి. ఇది ఫ్యాన్స్ అందరి నుంచి వినిపిస్తున్న మాట. మరి ఆ దిశగా అడుగులు వేస్తారా చూడాలి.