జగన్ సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. మాట తప్పని మడమ తిప్పని ముఖ్యమంత్రిగా  ఇప్పటికే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ... ప్రజా నేతగా మారిపోయారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఎన్నో సంక్షేమ పథకాలతో సరికొత్త చరిత్ర సృష్టించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి  ఎన్నో చారిత్రాత్మక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. అయితే తాజాగా వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చి  సంవత్సరం కాలం పూర్తయిన సందర్భంగా.. జగన్మోహన్ రెడ్డి తాము చేసిన పనులను గురించి చెప్పుకుంటుంది. 

 

 అయితే ఓ వైపు ప్రతిపక్ష పార్టీ జగన్ సర్కార్ పై విమర్శలు చేస్తూనే ఉంది. సంవత్సర కాలం పూర్తి అయినప్పుడు కూడా ఇప్పటికీ జగన్ సర్కార్ రాష్ట్ర అభివృద్ధికి  చేసిందేమీ లేదని విమర్శలు గుప్పిస్తోంది ప్రతిపక్ష టీడీపీ పార్టీ. కేవలం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  మాటలతోనే పబ్బం గడుపుతున్నారు అంటూ విమర్శలు చేస్తోంది. ఇదే సమయంలో జగన్మోహన్ రెడ్డి సర్కారు మాత్రం తాము గత సంవత్సర కాలంలో ఎలాంటి పనులు చేశాము  అన్న దాని గురించి వివరిస్తుంది. అంతే కాకుండా మన పాలన మీ సూచన అనే పేరుతో ఎంతో మంది వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో సమావేశం నిర్వహించి పలు సూచనలు సలహాలు తీసుకుంటున్నారు  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. 

 


 అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నో పథకాలు ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే.. ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.. కొన్ని ప్రత్యేక చట్టాలను కూడా తీసుకొచ్చారు.. అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు వేగంగా 102 పనులు చేసినట్లు చెప్పుకుంటున్నారు. అయితే జగన్ సర్కారు చేసిన ఈ 102 పనులలో  కొన్ని ప్రాథమిక దశలో ఉండగా కొన్ని ప్రస్తుతం ప్రజల వద్దకు చేరుకున్నాయి. కొన్ని ఇంకా మొదలు కాలేదు. జగన్ సర్కారు చేపట్టిన ఈ 102 పనుల్లో ఏ పథకాలు ఏ దశలో  ఉన్నాయి అనేది కింది వీడియోలో  పూర్తి వివరాలతో.

మరింత సమాచారం తెలుసుకోండి: