లాక్ డౌన్ తో ఇండస్ట్రీ మొత్తం స్థంభించిపోయింది. షూటింగులు మునుపటిలా మళ్లీ ఎప్పుడు పుంజుకుంటాయి అనేది బిగ్ క్వశ్చన్ గా మారింది. దీంతో ఇక ఎదురు చూడటం కంటే షెడ్యూల్స్ ని పక్కన పెట్టేయడమే బెటర్ అనుకుంటున్నారు దర్శక నిర్మాతలు. కోట్లు ఖర్చుపెట్టి కట్టించిన సెట్స్ ను కూడా కూల్చేస్తున్నారు. 

 

అక్షయ్ కుమార్, మానుషి చిల్లర్ కాంబినేషన్ లో ఓ హిస్టారికల్ డ్రామా రూపొందుతోంది. 12వ శతాబ్ధంలో ఉత్తర భారతాన్ని పాలించిన పృథ్వీరాజ్ చౌహన్ కథాంశంలో పృథ్వీరాజ్ అనే సినిమా వస్తోంది. ఈ మూవీలో అక్షయ్ కుమార్ టైటిల్ రోల్ ప్లే చేస్తున్నాడు. యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని చంద్రప్రకాశ్ ద్వివేది డైరెక్ట్ చేస్తున్నాడు. 

 

పృథ్వీరాజ్ సినిమా కోసం దర్శకుడు భారీ సెట్స్ కట్టించాడు. ఈ భారీ సెట్టింగులకు కోట్ల రూపాయలు ఖర్చు చేశాడు నిర్మాత. కానీ షూటింగ్ మధ్యలో ఉండగానే కరోనా వచ్చింది. లాక్ డౌన్ తో షూటింగ్ కు బ్రేకులు పడ్డాయి. అప్పటి నుంచి సెట్స్ నిర్మించిన చోటుకి అద్దె కడుతూనే ఉన్నాడు నిర్మాత. 

 

పృథ్వీరాజ్ సెట్స్ కు అద్దె కూడా భారీగానే కడుతున్నాడు నిర్మాత. ఇక హిస్టారికల్ డ్రామా అంటే చాలామంది క్రూ పనిచేయాలి. సెట్స్ లో వందలమంది జూనియ్ ఆర్టిస్టులుంటారు. ఇంత మందితో సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ షూటింగ్ చేయడం చాలా కష్టం. పైగా వానాకాలం వస్తోంది. ఇక సెట్స్ నుంచి లాభం లేదని, కూల్చేయిస్తున్నాడు నిర్మాత. 

 

కరోనా క్రైసిస్ నుంచి ఎలా బయటపడాలో తెలియక మూవీ మేకర్స్ తలలు పట్టుకుంటున్నారు. వడ్డీల భారం మోయలేక నిర్మాతలు సతమతమవుతున్నారు. అయితే ఈ సమస్యలు చాలవన్నట్టు రోబోతున్న వానాకాలం కూడా వీళ్లను భయపెడుతోంది. దీంతో చేసేది ఏమీ లేక కోట్ల సెట్స్ ను కూల్చేస్తున్నారు నిర్మాతలు. 

 

ఇక గంగూభాయి కోసం గోరేగావ్ ఫిల్మ్ సిటీలో 15కోట్లతో సెట్స్ వేయించాడు భన్సాలీ. అయితే ఈ లాక్ డౌన్ లో సెట్స్ ని ఉపయోగించకపోయినా.. రెంట్ లు మాత్రం కట్టాల్సి వస్తోంది. దీనికితోడు వర్షాకాలం కూడా వస్తోంది. ఇక వానలు పడితే సెట్స్ మొత్తం పాడైపోతాయి. అందుకే ఈ రెంట్ లు, వర్షాలకు భయపడి సెట్స్ ని కూలగొట్టించాడు భన్సాలీ. 

మరింత సమాచారం తెలుసుకోండి: