ప్రస్తుతం టాలీవుడ్ లో భారీ బడ్జెట్ తో దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా ఆర్ ఆర్ ఆర్. టాలీవుడ్ స్టార్స్ ఎన్.టి.ఆర్, రాం చరణ్ లతో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో ఆలియా భట్, ఒలీవియా మోరిస్, అజయ్ దేవగన్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అయితే ఈ సినిమా లాక్ డౌన్ తో షూటింగ్ ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఆర్.ఆర్.ఆర్ కి ఇది పెద్ద దెబ్బే అని అంటున్నారు. దీంతో సినిమా కూడా విడుదల వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయన్న చర్చ కూడా సాగుతోంది. ఈ విషయం నిర్మాత v v DANAIAH' target='_blank' title='డి వి వి దానయ్య-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>డి వి వి దానయ్య కూడా క్లారిటీ ఇచ్చారు. 

 

ఈ రకంగా చూస్తే ఆర్.ఆర్.ఆర్ 2021 జనవరి 8 న వచ్చే అవకాశాలు లేవని ఇప్పటికే కొంతవరకు క్లారిటి వచ్చింది. అయితే ఇప్పుడు అనుకున్నట్టుగా జనవరి 8 న రిలీజ్ చేయలేకపోయినప్పటికి శరవేగంగా కంప్లీట్ చేసి 2021 సమ్మర్ కి సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో నటిస్తున్న ఎన్.టి.ఆర్, రాం చరణ్ లు పాన్ ఇండియా స్టార్స్ గా క్రేజ్ రావడం పక్కా అని ఇప్పటికే ఇండస్ట్రీ మొత్తం మాట్లాడుకుంటుంది. అలాగే సీత పాత్రలో చరణ్ కి జంటగా నటిస్తున్న బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ కి కూడా ఆర్.ఆర్.ఆర్ తర్వాత సౌత్ అండ్ నార్త్ లో విపరీతమైన క్రేజ్ రాబోతుందని అంటున్నారు.

 

ఇక తాజా తెలుగు చిత్ర పరిశ్రమలో మరో ఆసక్తికరమైన వార్త హీటెక్కిస్తోంది. వాస్తవంగా రాజమౌళి సినిమాలలో హీరోయిన్స్ కూడా బాగా పాపులర్ అవుతుంటారు. గ్లామర్ గా చూపించడంలో, పర్ఫార్మెన్స్ విషయంలో హీరోయిన్స్ ని కూడా అద్భుతంగా చూపిస్తారు. ఇప్పుడు ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ కి జంటగా నటిస్తున్న బ్రిటీష్ స్టేజ్ ఆర్టిస్ట్ ఒలీవియా మోరిస్ హాట్ టాపిక్ గా మారింది. సినిమాలో ఈ ఇద్దరి జంట చాలా అద్భుతంగా ఉంటుందని అలాగే అధ్బుతమైన సాంగ్ కూడా ఉంటుందని తెలుస్తుంది.

 

1920ల నాటి వెస్ట్రన్ అండ్ ఇండియన్ స్టైల్ లో సాగే ఈ సాంగ్ లో ఎన్.టి.ఆర్ ఒలీవియా మోరిస్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగిస్తారని అంటున్నారు. అంతేకాదు ఆర్.ఆర్.ఆర్ తర్వాత ఒలీవియా మోరిస్ టాలీవుడ్ తో పాటు సౌత్ మొత్తం భారీగా క్రేజ్ సాధించుకుంటుందని చెప్పుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: