దాసరి నారాయణరావు తెలుగు సినిమాకళామతల్లి ముద్దు బిడ్డ. ఆయనలో ముందు మంచి కధకుడు ఉన్నాడు. ఆ తరువాత మాటలు రాసే రైటర్ ఉన్నాడు. దాన్ని నాటకీయంగా చూపించే దర్శకుడు ఉన్నాడు. ఇక సినిమారంగానికి వెళ్ళాక దాసరి ప్రతిభను అప్పటికే తలపండిన సినీ లోకమంతా కళ్ళారా చూసి ఆశ్చర్యపోయింది.

 

బహుముఖ ప్రతిభాశాలి అన్న మాటకు అసలైన అర్ధంగా దాసరినే చెప్పుకోవాలి.  వెండితెర మీద ఇన్ని చేసినా కూడా  దాసరి తెలుగు సినిమా పరిశ్రమకు కూడా విశేషంగా సేవ చేశారు. ఆయనకు ఎటువంటి ఇగోలు లేవు, తాను పెద్దవాడిని అన్న గర్వం ఇసుమంత అయినా లేదు, ఆయన ఎన్ని శిఖరాలు ఎక్కినా కూడా డౌన్ టు ఎర్త్ అన్నట్లుగా ఉండేవారు.

 

ఆయన దగ్గరకు ఏదైనా సమస్యను చెప్పడానికి  సినిమాకు సంబంధించి అతి సామాన్యుడైన వెళ్ళిపోవచ్చు. ఆయన అంతలా అందుబాటులో ఉండేవారు. మరో ప్రత్యేక గుణం ఏంటి అంటే ఆయన అందరి వాడిగా ఉండేవారు. ఆయన దగ్గరా స్టారిజాలు, బేషజాలు చెల్లవంతే. దాసరి ఒక సింహంలా బతికారు. చివరి దాకా తన హోదాను కాపాడుకున్నారు.

 

తెలుగు చిత్ర సీమకు పెద్ద దిక్కుగా నిలిచారు. అవసరం అనుకుంటే ఎంతటి పెద్ద వారినైనా ఎదిరించే సత్తా ఆయన సొంతం. ఆయనకు రాజీపడడాలు, రాజకీయాలు తెలియవు. మనసులో ఏముందో అదే బయటకు వస్తుంది. అందుకే ఆయన  రాజకీయాల్లో రాణించలేదు కానీ సినీ కార్మికుల గుండెల్లో మాత్రం శాశ్వతంగా గూడు కట్టుకున్నారు.

 

దాసరి సినీ రంగానికి పెద్ద అంతే. ఇందులో రెండవ అభిప్రాయం లేదు. ఎవరికీ గొడవలు అంతకంటే లేవు. ఆయనొక్కరే ఆ భారాన్ని మోయగలరని అంతా నమ్మేవారు.ఆయన తప్ప వేరెవరినీ ఊహించుకోలేకపోయేవారు.  ఇపుడు దాసరి లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది.దాసరి 2017 మే 30న ఈ లోకాన్ని వీడి వెళ్ళిపోయారు.

 

అదే మే నెలలో పుట్టిన దాసరి అదే నెలలో కన్నుమూయడం ఒక యాధ్రుచ్చికంగా చెప్పాలి. ఇక టాలీవుడ్ మూడేళ్ళుగా దాసరి లేని లోటు తో అలాగే ఉంది. సినీ సీమను ఏకమొత్తంగా కలిపి ఉంచిన ఘనత దాసరిదే. అందుకే ఆయన చైర్ అప్పటి నుంచి ఇప్పటికీ ఖాళీగానే ఉంది. దాసరి ముందూ తరువాత ఎవరూ లేరు.వన్ అండ్ ఓన్లీ దాసరి.ఆయనకు ఆయనే సాటి.  ఆయనకు లేనేలేదు పోటీ.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: