టాలీవుడ్ లో మరోసారి గ్రూప్ తగాదాలు మరియు ఆధిపత్య పోరు బయటపడ్డాయి. లాక్ డౌన్ మొదలు అయ్యి ఇప్పటికి రెండు నెలలు పూర్తి అయ్యింది. అయితే ఈ లాక్ డౌన్ కారణంగా ఎన్నో సినిమాలు తమ షూటింగ్ లను వాయిదా వేసుకుని పక్కన పెట్టాయి. సడలిస్తున్న లాక్ డౌన్ నిబంధనల  దృష్ట్యా ఆయా రాష్ట్రాల సినిమా సంఘాలు ప్రభుత్వాలను ఇప్పటికే అనుమతులు కోరుతూ వినతి పత్రాలు అందించాయి. ఈ నేపథ్యం లోనే టాలీవుడ్ సినీ కార్యక్రమాలకు అనుమతులు కోసం ప్రభుత్వాన్ని కోరుతూ సినీ ప్రముఖులు హీరో చిరంజీవి ఇంట్లో సమావేశానికి హాజరు అయ్యారు. ఈ సమావేశానికి srinivas YADAV' target='_blank' title='తలసాని శ్రీనివాస్ యాదవ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా అటెండ్ అయ్యారు. తెలుగు చిత్రసీమ నుంచి రాజమౌళి, నాగార్జున, త్రివిక్రమ్, కొరటాల శివ  లాంటి ప్రముఖులు పాల్గొన్నారు.

 

 

అయితే ఈ సమావేశానికి బాలయ్య హాజరు కాలేదు. ఈ విషయం గురించి మీడియా బాలయ్యను అడుగగా ఆ విషయం గురించి నాకు ఏమి తెలియదు. ఆ సమావేశానికి నన్ను పిలవలేదని. చిరంజీవి ఇంట్లో భూములు పంచుకోవటానికి ఈ సమావేశం జరిపి ఉండవచ్చని అయన విమర్శలు గుప్పించారు. ఈ వ్యాఖ్యలతో టాలీవుడ్ లో దుమారం రేగింది. దీనికి సమదనగా నాగబాబు ఆన్లైన్ లో కౌంట్ కూడా ఇచ్చారు. బాలయ్యను నాగబాబు.. నువ్వు ఏమి కింగ్ వి కాదు కేవలం హీరో వి మాత్రమే అన్నారు . నాగబాబు వ్యాఖ్యలపై ప్రముఖ నిర్మాత ప్రసన్న కుమార్ బాలయ్యకు సపోర్ట్ గా నిలిచాడు. చిరంజీవి గారు సమావేశం ఎక్కడైనా జరుపుకోవచ్చు కానీ. బాలయ్యను సమావేశానికి ఆహ్వానించక పోవడం తప్పు.బాలయ్య హీరో మాత్రమే కాదు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ లో మెంబర్ కూడా. కాబట్టి బాలయ్యకు గౌరవం ఇచిమాట్లాడండి అంటూ బాలయ్యకు అండగా నిలిచాడు ప్రసన్న కుమారు. కొత్తగా టాలీవుడ్ లో మొదలైన ఈ ఆధిపత్య పోరు ఎంతవరకు వెళుతుందో మరి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: