టాలీవుడ్ లో కొందరి మధ్య గొడవలు హాట్ న్యూస్ గా మారుతాయి. అందరు కలిసి క్రియేటివ్ ఫీల్డ్ లో ఉంటూ తమ టాలెంట్ చూపిస్తున్నా సరే ఏవో కారణాల వాళ్ళ వారి మధ్య గొడవలు కావడం సహజం. అలాంటి వాటిలో రవితేజ, రాజా రవీంద్ర మధ్య జరిగిన విషయాలు చెప్పుకుంటే. చిన్న చిన్న పాత్రలతో కెరియర్ మొదలు పెట్టి హీరోగా మంచి సక్సెస్ అందుకున్న రవితేజ మాస్ మహారాజాగా ప్రేక్షకుల మనసులు గెలిచాడు. అయితే తనతో పాటుగా ఎన్నో ఏళ్లుగా సినిమాల్లో ఉంటూ వస్తున్న రాజా రవీంద్రని తన మేనేజర్ గా పెట్టుకున్నాడు రవితేజ. 

 

రవితేజ, రాజా రవీంద్రల మధ్య ఏమైందో ఏమో కానీ రవితేజ రాజా రవీంద్రని తన మేనేజర్ గా తీసేసి దూరం పెట్టాడు. అప్పట్లో వచ్చిన వార్తలు ఏంటంటే రవితేజకు సంబందించిన కొన్ని ఫైనాన్షియల్ మేటర్స్ లో రాజా రవీంద్ర ఇన్వాల్వ్ మెంట్ ఎక్కువ అవడం.. కొన్ని అవకతవకలులాంటివి జరిగాయట. అంతేకాదు ఒక లాండ్ విషయంలో కూడా ఏదో తేడా కొట్టడంతో రాజా రవీంద్రని దూరం పెడుతూ వచ్చాడు రవితేజ. ఈ విషయాన్ని రాజా రవీంద్ర ఓ ఇంటర్వ్యూలో ప్రేక్షకులతో పంచుకున్నారు. రవితేజ పెళ్లి విషయంలో కూడా రాజా రవీంద్ర ఇన్వాల్వ్ మెంట్ ఉందని తెలుస్తుంది. 

 

ప్రస్తుతం రాజా రవీంద్ర యువ హీరోలైన నిఖిల్, రాజ్ తరుణ్ లాంటి వారికి మేనేజర్ గా ఉంటున్నారు. నటుడిగా స్థిరపడినా బిజీ ఆర్టిస్ట్ గా మాత్రం అవ్వలేకపోయాడు రాజా రవీంద్ర. రవితేజ, రాజా రవీంద్రల మధ్య గొడవలు అటుంచితే ఇప్పటికి రవితేజతో తాను మాట్లాడవుతానని మా మధ్య ఎలాంటి గొడవలు లేవని అంటుంటారు రాజా రవీంద్ర. అయితే ఓకే ఇండస్ట్రీలో పనిచేస్తున్న వారు కాబట్టి ఒక సందర్భంలో గొడవ పడినా మరో సందర్భంలో కలవక తప్పదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: