టాలీవుడ్ లో బాలకృష్ణ కు ఉన్న పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఆయనకు ఉన్న పేరు ఆయన చేసిన సినిమాలు అన్నీ కూడా  ఒక సంచలనమే. తండ్రి స్టార్ అయినా సరే ఆయన మాత్రం తన సొంత ఇమేజ్ తో పైకి వచ్చే విధంగా కష్టపడ్డారు. అయితే ఆయన వివాదాలకు ఎప్పుడు కూడా దూరంగానే ఉన్నారు. వివాదాలను ఆయన దగ్గరకు రానీయలేదు అనే చెప్పవచ్చు. అయితే ఇటీవల ఆయనకు వివాదాలు కాస్త ఎక్కువగా ఉన్నాయి. అందులో ప్రధానంగా చెప్పుకునేది నాగ బాబు వ్యవహారం తో. 

 

నాగ బాబు ఇటీవల కాలంలో బాలకృష్ణ మీద చాలా సందర్భాల్లో విమర్శలు చేసారు. బాలకృష్ణ స్పందించినా లేకపోయినా సరే ఆయన మాత్రం ఏదోక విమర్శ చేస్తూనే ఉన్నారు. తాజాగా కూడా ఆయన బాలకృష్ణ మీద విమర్శలు చేసారు. ఆవేశంగా మాట్లాడే నాగ బాబు బాలకృష్ణ కు వార్నింగ్ ఇవ్వడం ఇటీవల సంచలనంగా మారింది అనే చెప్పవచ్చు. టాలీవుడ్ లో సినిమాలకు సంబంధించిన ఒక సమావేశంలో మంత్రి తో కలిసి కూర్చున్న సమయంలో తనను పిలవలేదు అని బాలకృష్ణ వ్యాఖ్యలు చేసారు. 

 

దీనిపై నాగబాబు అసహనం వ్యక్తం చేయడమే కాకుండా బాలకృష్ణ కేవలం హీరో మాత్రమే కింగ్ కాదు అని వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారం ఇంకా చల్లారలేదు. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో కూడా నాగబాబు ఇదే విధంగా బాలయ్యని టార్గెట్ చేసి సోషల్ మీడియా లో వ్యాఖ్యలు ఎక్కువగా చేస్తూ వచ్చారు. ఆ తర్వాత ఇవి చల్లారిపోయినా సరే వివాదం మాత్రం అదే విధంగా ఉంది అని చెప్పవచ్చు. ఇక ఇప్పుడు మరో సారి వారి మధ్య విభేదాలు బయటపడ్డాయి. మరి దీనిపై భవిష్యత్తులో బాలకృష్ణ ఏ విధంగా స్పందిస్తారు.. నందమూరి అభిమానులు ఏ విధంగా స్పందిస్తారు అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: