టాలీవుడ్ లో మోహన్ బాబు అనవసరంగా ఆవేశ పడుతూ ఉంటారు అని చాలా మంది అంటూ ఉంటారు. ఆయనకు కొంచెం తెలిస్తే దాన్ని మరి కొంచెం ఊహించుకుని విమర్శలు చేస్తూ ఉంటారు అని చాలా మంది అంటూ ఉంటారు. అనవసరంగా ఆయన ఆవేశం ఆయనను బాగా ఇబ్బంది పెట్టింది అనేది చాలా మంది చెప్పే మాట. ఇక ఆయన అందరి తో కూడా వివాదాలు పెట్టుకుంటారు అనే పేరు కూడా ఎక్కువగా వినపడుతూ ఉంటుంది. లేని పోనీ విషయాల్లో ఆయన తల దూరుస్తూ ఉంటారు. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విషయంలో కూడా ఆయన అదే విధంగా వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. 

 

చంద్రబాబు ని ఆయన విమర్శించిన విమర్శలు రాజకీయ నాయకులు కూడా విమర్శించలేదు అనేది టాలీవుడ్ లో చాలా మంది చెప్పే మాట. అనవసరంగా అయన చంద్రబాబు విషయంలో ఏదో ఊహించుకుని విమర్శలు చేసారు అని అంటారు. లక్ష్మీ పార్వతి విషయంలో వీరి మధ్య విభేదాలు వచ్చాయని ఎన్టీఆర్ తో లక్ష్మీ పార్వతి ఉండటానికి మోహన్ బాబు సహకారం అందించారని అలాగే ఆమె తో కలిసి తనను ఇబ్బంది పెట్టాలి అని మోహన్ బాబు భావించారు అని కొందరు అంటారు. ఆ తర్వాత వాళ్ళ మధ్య విభేదాలు క్రమంగా బయటపడ్డాయి. 

 

కాని క్రమంగా అవి తగ్గుతూ వచ్చాయి. అయితే తెలుగుదేశం పార్టీ రెండు గా చీలడం ఎన్టీఆర్ కి చంద్రబాబు దూరం కావడం వంటివి జరిగాయి. చంద్రబాబు ఎన్టీఆర్ ని అవమానించారు అని మోహన్ బాబు భావించారు అని అంటారు. ఇక మోహన్ బాబు ఆ పరిణామం తట్టుకోలేక తర్వాత తర్వాత చంద్రబాబు మీద కోపంగా కూడా ఉండే వారు అని అంటారు. అయితే చంద్రబాబు కుటుంబానికి మోహన్ బాబు కుటుంబానికి బంధుత్వం కూడా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: