సినిమా ఇండస్ట్రీలో హీరోల మధ్య ఇతర టెక్నీషియన్స్ మధ్య ఈగోలు మనస్పర్థలు ఎంతవరకు ఉంటాయో తెలియదు గాని హీరోయిన్స్ మధ్య ఖచ్చితంగా ఉంటాయని చెప్పవచ్చు. ఎవరో ఒకరిద్దరు తప్పితే హీరోయిన్స్ లలో బెస్ట్ ఫ్రెండ్స్ పెద్దగా కనిపించరు. చాలా వరకు స్టార్ హీరోయిన్స్ తెర వెనుక ఈగోలతో సీరియస్ గా ఉంటారని ఒక టాక్ ఉంది. ఇక ప్రస్తుతం బుట్ట బొమ్మ పూజా హెగ్డే, అక్కినేని సమంత వంటి స్టార్ హీరోయిన్స్ మధ్య కూడా కోల్డ్ వార్ కొనసాగుతున్నట్లు అనుమానం వస్తోంది. సమంత - పూజా హెగ్డే మధ్య రెండు రోజులుగా ఆసక్తికరమైన వార్ నడుస్తుంది. తనకు తెలియకుండా తన సోషల్ మీడియా పేజీ హ్యాక్ అయ్యింద‌ని పూజా హెగ్డే ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. కొన్ని గంట‌ల పాటు త‌న టెక్నిక‌ల్ టీం సాయంతో  ఖాతాను తిరిగి పున‌రుద్ద‌రించిన‌ట్లు తెలిపారు. అయితే అప్ప‌టికే జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రిగిపోయింది. ఖాతా హ్యాక్ అయిన సంద‌ర్భంలో పూజా హెగ్డే ఇన్‌స్టాగ్రామ్‌లో.. 'మ‌జిలీ' సినిమాలోని స‌మంత ఫోటోను జ‌త చేస్తూ ''ఈమె (స‌మంత ) నాకు పెద్ద‌గా అందంగా క‌నిపించ‌దు'' అంటూ కామెంట్ చేశారు.

 

IHG

 

ఇది నిజంగా హ్యాకర్లు చేసిన పనా లేక ఇంకెవరైనా చేసారో తెలియదు కానీ ఇది స‌మంత అభిమానుల‌కు ఆగ్ర‌హం తెప్పించింది. అకౌంట్ హ్యాక్ అయ్యింద‌ని పూజా వివ‌ర‌ణ ఇచ్చినా ఫ్యాన్స్ అవేం ప‌ట్టించుకోలేదు. వెంట‌నే స‌మంత‌కు సారీ చెప్పాలంటూ పెద్ద ఎత్తున ట్విట్ట‌ర్‌లో ట్రెండ్ చేశారు. దీనికి తోడు డైరెక్ట‌ర్ నందినీ రెడ్డి, గాయ‌ని చిన్మ‌యి శ్రీపాద.. పూజా హెగ్డేను ఉద్దేశించి వ్యంగాస్ర్తాలు సందించారు. 'నా బ్రెయిన్ కూడా హ్యాక్ అయ్యింది' అంటూ నంద‌నీ కామెంట్ పెడితే.. 'ప్లీజ్ ల‌వ్ మీ టూ.. నా అకౌంట్ హ్యాక్ అవ్వ‌లేదు' అంటూ చిన్మ‌యి వ‌రుస కామెంట్లు పెడుతూ స‌మంత‌ - పూజా ల గురించే అనుకునేలా కామెంట్స్ చేసుకున్నారు. నిజాలు తెలుసుకోకుండా ఇలా చీప్ కామెంట్లు పెడ‌తారా అంటూ నంద‌నీ రెడ్డి పై ఫైర్ అయ్యారు పూజా ఫ్యాన్స్. దీంతో వివాదం మ‌రింత ముదిరి అటు స‌మంత ఫ్యాన్స్, ఇటు పూజా హెగ్డే ఫ్యాన్స్ వ‌రుస ఆరోప‌ణలు చేస్తూ  ట్విట్ట‌ర్‌లో ర‌చ్చ ర‌చ్చ చేస్తున్నారు. 'వి స‌పోర్ట్ పూజా హెగ్డే' అంటూ ఆమె అభిమానులు వ‌రుస ట్వీట్లు చేస్తున్నారు.

 

 

అయితే ఇప్పుడు సామ్ ఇంస్టాగ్రామ్ స్టోరీ చూస్తే ప్రెజెంట్ జరుగుతున్న ఇష్యూ మీదే పెట్టినట్లుగా అనిపించక మానదు. సామ్ ఈ రోజు స్టోరీ పెడుతూ ''గుడ్ హార్ట్ కలిగి ఉండటంలో మరొక సమస్య ఏమిటంటే, మీరు తెలివి తక్కువవారు అని వారు భావిస్తుంటారు'' అనే లైన్స్ పెట్టింది. ఇది రీసెంటుగా జరుగుతున్న ఇష్యూ మీదనే సామ్ పెట్టిందని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. మరి రాబోయే రోజుల్లో ఇది ఎంత దూరం వెళ్తుందో చూడాలి. 

 

https://www.instagram.com/stories/samantharuthprabhuoffl/2320145092083833236/

మరింత సమాచారం తెలుసుకోండి: