బాలీవుడ్ లో ఏడాదికి మూడు సినిమాలు తీసే హీరోలెవరైనా ఉన్నారంటే అది ఒక్క అక్షయ్ కుమార్ అనే చెప్పాలి. స్టార్ హీరోలందరూ ఏడాదికి ఒక్క సినిమా తీయడానికే తంటాలు పడుతున్న సమయంలో మూడు సినిమాలకి పైగా తీస్తూ వరుస సక్సెస్ లని అందుకుంటున్నాడు. గత ఏడాది అక్షయ్ కుమార్ సినిమాల ద్వారా వచ్చిన ఆదాయం 700కోట్లకి పైమాటే అంటే ఆశ్చర్యం వేయక మానదు. వరుస పెట్టి సినిమాలు తీస్తోన్న అక్షయ్ కుమార్ లక్ష్మీ బాంబ్ అనే సినిమాని సిద్ధం చేశాడు.

 

రాఘవ లారెన్స్ తెరకెక్కించిన కాంచన సినిమాకి హిందీ రీమేకే లక్ష్మీ బాంబ్. లారెన్స్ నటించి దర్శకత్వం వహించిన కాంచన సినిమా బాక్సాఫీసుని షేక్ చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ సినిమాకి భారీగా కలెక్షన్లు వచ్చాయి. కామెడీ హార్రర్ ని మిస్ చేసి సక్సెస్ అయిన మొదటి సినిమాగా కాంచనని చెప్పుకోవచ్చు. అయితే ఈ సినిమాని అక్షయ్ కుమార్ హీరోగా రాఘవ లారెన్స్ దర్శకత్వంలో హిందీలో రీమేక్ చేశారు. 

 

చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం అన్నీ సవ్యంగా కుదిరితే ఈ పాటికే థియేటర్లలో రిలీజై ఉండేది. కానీ కరోనా వల్ల థియేటర్లు మూసేయడంతో విడుదల ఆగిపోయింది. అయితే ఈ సినిమాకి ఓటీటీ నుండి భారీ ఆఫర్ వచ్చిందని టాక్ వినబడుతుంది. ఇప్పటి వరకూ పెద్ద హీరోల సినిమాలేవీ డైరెక్ట్ ఓటీటీలో విడుదల కాలేదు. దాంతో స్ట్రీమింగ్ ఛానెల్స్ లక్ష్మీ బాంబ్ సినిమాకి పెద్ద మొత్తంలో ఆఫర్ చేస్తున్నారట.

 

స్ట్రీమింగ్ ఛానెల్స్ లో ఒకటైన హాట్ స్టార్ లక్ష్మీ బాంబ్ డిజిటల్ రైట్స్ ని 120 కోట్లకి కొనుక్కుందని అంటున్నారు. కేవలం డిజిటల్ రైట్స్ కి ఇంత పెద్ద మొత్తంలో అమౌంట్ పెట్టడం ఇదే మొదటిసారని అంటున్నారు. అక్షయ్ కుమార్ వంటి హీరో సినిమా డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ అవుతుంటే ఆ మాత్రం ఇచ్చుకోవాల్సిందే అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: