టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న హీరోలు చాలా మంది ఉన్నారు. ఆ లిస్ట్ లో అక్కినేని హీరో అఖిల్ కూడా ఉన్నాడని చెప్పవచ్చు. ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని అఖిల్ తన శక్తినంతా ధార పోస్తున్నాడు గాని వర్కవుట్ అవ్వడం లేదు. ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి. అఖిల్.. అక్కినేని నట వారసుడిగా 'అఖిల్' సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు. ఆ సినిమా ఆశించినంత విజయం సాదించనప్పటికీ అఖిల్ స్క్రీన్ ప్రెజన్స్ కి మంచి మార్కులే పడ్డాయి. ఆ తర్వాత అక్కినేని ఫ్యామిలీకి 'మనం' లాంటి చిత్రాన్ని అందించిన విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో రెండో సినిమాగా 'హలో' చిత్రంలో నటించాడు. ఈ సినిమా నటుడిగా మంచి గుర్తింపు తెచ్చినప్పటికీ మాస్ ఆడియన్స్ కోరుకొనే ఎలిమెంట్స్ లేకపోవడంతో సెన్సిబుల్ సినిమాగా మిగిలిపోయింది. మూడో సినిమాగా వచ్చిన మిస్టర్ మజ్ను కూడా అఖిల్ ని నిలబెట్టలేకపోయింది. అఖిల్ బ్లాక్ బస్టర్ హిట్ కోసం ఎంత ప్రయత్నించినా ఆ ఒక్కటి మాత్రం రావడం లేదు.

 

టాలెంటెడ్ ద‌ర్శ‌కుల‌తో ప‌ని చేసినా కూడా.. సినిమాల‌కు పాజిటివ్ టాక్ వ‌చ్చినా కూడా ఇప్ప‌టి వ‌ర‌కు సూపర్ హిట్ మాత్రం రాలేదు. కష్టపడేవారికి అదృష్టం కూడా కాస్త కలిసి వస్తే ఎలాంటి అడుగులు వేసినా సక్సెస్ అవుతారు. అయితే అఖిల్ అదృష్టం ఏమిటో గాని వచ్చినట్లే వచ్చి దూరమవుతోంది. ఇష్టం వచ్చినట్లుగా అతనితో దోబూచులాడుతోంది. మొదటి సినిమా నుంచి చూసుకుంటే అఖిల్ సినిమాలకు హైప్ బాగానే క్రియేట్ అవుతోంది. కానీ రిలీజ్ తరువాత ఊహించని విధంగా రిజల్ట్ అందుకుంటున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు నాలుగో సినిమాను డైరెక్ట‌ర్‌ బొమ్మరిల్లు భాస్కర్ తో చేస్తున్నాడు అఖిల్. దాదాపు తెలుగు ప్రేక్ష‌కులు అంతా మ‌రిచిపోయిన బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్' సినిమా చేయ‌బోతున్నాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాస్, వాసు వర్మ నిర్మించనున్నారు. అల్లు అరవింద్ సమర్పకులుగా వ్యవహరిస్తారు. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి గోపీ సుందర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని సమ్మర్ కానుకగా ఏప్రిల్ లో విడుదల చేయాలని చిత్ర బృందం భావించింది. కానీ కరోనా వైరస్ నేపథ్యంలో చిత్ర షూటింగు నిలిచిపోయింది.

 

ఇదిలా ఉండగా అఖిల్ అక్కినేని తన దగ్గరకు వచ్చిన ఒక హిట్ సినిమాని రిజెక్ట్ చేశాడట. లాస్ట్ ఇయర్ తమిళ్ లో రిలీజై హిట్ అందుకున్న 'మై కాదవులే' సినిమా తెలుగు రైట్స్ పీవీపీ దక్కించుకున్నాడట. రొమాంటిక్ కామెడీ మూవీగా వచ్చిన ఈ సినిమా అఖిల్ కి సెట్ అవుతుందని నిర్మాతలు భావించారట. అయితే అఖిల్ రీమేక్ సినిమాలో ఇప్పుడే నటించే ఉద్దేశం లేదని ఈ ఆఫర్ ని సున్నితంగా తిరస్కరించాడట. నిజానికి వంశీ పైడిపల్లి దర్శకత్వంలో హిందీలో సూపర్ హిట్ అయిన ఒక సినిమాని అఖిల్ తో చేస్తున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి. వీరి కాంబినేషన్ లో సినిమా ఉంటుందని కింగ్ నాగార్జున కూడా ప్రకటించారు. అయితే ఏమి జరిగిందో ఏమో కానీ ఈ సినిమా పట్టాలెక్కలేద్దు. సో ఈ విధంగా అఖిల్ చేయాల్సిన రెండు రీమేక్ సినిమాలు ఆయన చేయదాటిపోయాయి. 

 

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: