టాలీవుడ్ లో కొన్ని కొన్ని వ్యవహారాలూ ఎప్పటికి కూడా ఒక సంచలనం గానే ఉంటూ ఉంటాయి. టాలీవుడ్ లో ఒక వెలుగు వెలిగిన వారు వారి వ్యవహారాలూ అదే విధంగా టాలీవుడ్ లో కొందరు పెద్దల ప్రవర్తించే తీరు అన్నీ కూడా చాలా వరకు సంచలనంగా ఉంటూ ఉంటూ ఉంటాయి. ఇక తాజాగా కొన్ని వ్యవహారాలను ప్రత్యేకంగా టాలీవుడ్ లో చూస్తే... సుమన్, చిరంజీవి వ్యవహారం ఒక సంచలనం. సుమన్ సినీ జీవితం ఈ విధంగా అయిపోవడానికి చిరంజీవి కారణం అనేది చాలా మంది చెప్పే మాట. ఏదో వ్యవహారంలో సుమన్ జైలుకి వెళ్ళారు అని, 

 

కాని బెయిల్ రాకుండా చిరంజీవి అడ్డుకున్నారు అని కొందరు ఇప్పటికి కూడా ప్రచారం చేస్తూ ఉంటారు. సుమన్ స్టార్ హీరో అయ్యే వారు అని కాని చిరంజీవి కి ఇబ్బంది కాబట్టి అప్పుడు సుమన్ ని పైకి రానీయలేదు అని అంటారు. అయితే అందులో వాస్తవం ఎంత అనేది ఎవరూ కూడా చెప్పలేని విషయం. కాని దాని మీద ప్రచారం మాత్రం ఎవరికి ఎంత కావాలో అంత చేసుకున్నారు. ఇక చిరంజీవి కి అడ్డు వస్తారని అల్లు అరవింద్ వంటి వారు ఆయనను బాగా ఇబ్బంది పెట్టారు అని అంటారు. అయితే అందులో నిజాలు లేవు అనేది చాలా మంది మాట. 

 

కేవలం అవి ఊహలు మాత్రమే గాని నిజాలు కాదు అని చెప్తారు. అనవసరంగా ఏదో ఊహించుకుని ఆ విధంగా ప్రచారం చేసుకున్నారు అని భవిష్యత్తు సుమన్ కి ఇబ్బంది పడటానికి ఆయన వ్యవహారశైలే కారణం అనేది కొందరి మాట. ఏది ఎలా ఉన్నా సరే ఆ వ్యవహారం మాత్రం అప్పట్లో ఒక సంచలనంగా చెప్తూ ఉంటారు. ఇక సుమన్ ఆ తర్వాత హీరో పాత్రలకు దూరమయ్యారు. విలన్ గా కూడా నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: