టాలీవుడ్ లో ఇప్పుడు కొందరు హీరోలను పక్కన పెట్టే ఆలోచనలో టాలీవుడ్ నిర్మాతలు, దర్శకులు ఉన్నారా...? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. ఇప్పుడు చాలా వరకు టాలీవుడ్ లో నష్టాలు వస్తున్నాయి. అవును గత కొన్ని రోజులుగా టాలీవుడ్ బాగా ఇబ్బంది పడుతుంది. సినిమాల హిట్ రేటింగ్ కూడా చాలా తక్కువగా ఉంది. ఈ ఏడాది సంక్రాంతి తర్వాత ఒకటి రెండు సినిమాలు మాత్రమే ఆకట్టుకున్నాయి. సంక్రాంతికి వ‌చ్చిన టాప్ హీరోల సినిమాలు అయిన అల వైకుంఠ‌పుర‌ములో, స‌రిలేరు నీకెవ్వ‌రు బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయ్యాయి.

 

ఆ త‌ర్వాత వ‌చ్చిన సినిమాల్లో నితిన్ భీష్మ సినిమా ఒక్క‌టి మాత్ర‌మే హిట్ అయ్యింది. ఇక సంక్రాంతి నుంచి మార్చి వ‌ర‌కు వ‌చ్చిన చాలా సినిమాలు టాలీవుడ్ లో బోల్తా పడిన సంగతి తెలిసిందే. ఇక మ‌రి కొంద‌రు యువ హీరోలు, మీడియం రేంజ్ హీరోలు స‌రైన హిట్ లేక మొఖం వాచి ఉన్నారు. ఇప్పుడు ఎవరు అయితే ఫ్లాప్ హీరోలు ఉన్నారో వారిని పక్కన పెట్టాలని మార్కెట్ ఉన్న హీరోలను మాత్రమే తీసుకోవాలని భావిస్తున్నారని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఏ హీరో అయినా సరే రెండేళ్ళ నుంచి మంచి సినిమాలు హిట్ అయితేనే తీసుకోవాలని లేకపోతే సదరు హీరోకి ఎంత ఇమేజ్ ఉన్నా సరే పక్కన పెట్టాలని టాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి.

 

మార్కెట్ ఎవరికి అయితే ఉంటుందో వారినే తీసుకోవాలని భావిస్తున్నారు. అదే టైం లో రెమ్యున‌రేష‌న్ కాస్త త‌క్కువ తీసుకునే వారిపై కూడా ఆస‌క్తి చూపుతున్నారు. ప్రస్తుతం నిర్మాతలు అందరూ కూడా ఇప్పుడు ఇదే ప్రయత్నాల్లో ఉన్నారు. భారీ బడ్జెట్ సినిమాలు వద్దని, దర్శకులు కూడా హిట్ లు ఉన్న దర్శకులను మాత్రమే తీసుకోవాలని యోచనలో ఉన్నారు. మార్కెట్ లేని... భారీ రెమ్యున‌రేష‌న్లు డిమాండ్ చేసే ఏ హీరోని అయినా సరే పక్కన పెట్టాల్సిందే అని టాలీవుడ్ భావిస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఇది ఎంత వరకు ఫలిస్తుంది అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: