టాలీవుడ్ లో ప్రస్తుతం ఓ వైపు లాక్ డౌన్ హడావిడి ఉన్నా కూడా పెళ్లిళ్ల న్యూస్ బాగా హైలెట్ అవుతూ వస్తోంది. యువ హీరోల పెళ్లి లేదా యువ హీరోల విషయాలు యువతలో మంచి క్రేజ్ ఉండే అంశాలు. వీటి గురించి ఏ చిన్న వార్త వచ్చినా సరే దానికి మీడియా తో పాటుగా ప్రతీ ఒక్కరు కూడా ఏదోక ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఇక సినిమా అభిమానుల నుంచి సాధారణ ప్రజల వరకు వీటిని తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఈ విషయం మన అందరికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అనవసర విషయాల మీద మీడియా ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటుంది అనే విషయం అందరికి తెలుసు. ఇక ఇప్పుడు రానా పెళ్లి విషయంలో కూడా అదే జరుగుతోంది.
తాజాగా రానా పెళ్లి విషయంలో కొన్ని వార్తలు మీడియాలో ఎక్కువగా వస్తున్నాయి. దీనితో రానా ఇప్పుడు జాగ్రత్త పడుతున్నాడు అని సమాచారం. ఏది చేసినా సరే మీడియా తో చెప్పకుండా చెయ్యాలని చూస్తున్నాడు. మీడియా లో చెప్పిన దగ్గరి నుంచి కూడా అనవసరంగా పనికి రాని చర్చలు అన్నీ కూడా జరుగుతున్నాయి అని... దీంతో అనవసరంగా సమయం వృధా అవుతుందని తనకు ఫోన్ లు కూడా వస్తున్నాయని సన్నిహితులతో చెపుతున్నాడట.
అందుకే పెళ్లి విషయాన్ని ఎవరితో కూడా చెప్పకుండా సైలెంట్ గా చేసుకుని సైలెంట్ గా ఉండాలి అని భావిస్తున్నట్టు సమాచారం. దీనికి సంబంధించి ఎంత హడావుడి చేస్తే అంత నష్టం మినహా లాభం లేదని రానా భావిస్తున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఈ పెళ్లి గురించి చర్చలు ఉన్న నేపధ్యంలో రానా కూడా ప్రతీ విషయాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచిస్తున్నాడు అని సమాచారం. ఇక రానా - మిహీకా బజాజ్ పెళ్లికి ఇరు వైపులా నుంచి ఆమోదం లభించిన నేపథ్యంలో కరోనా హడావిడి తగ్గిన వెంటనే పెళ్లి జరిగే ఛాన్స్ ఉంది.