గత రెండు రోజులుగా పూజా హెగ్డే, సమంత అక్కినేని అభిమానుల మధ్య పెద్ద యుద్ధమే జరుగుతుంది. సోషల్ మీడియాలో పూజా హెగ్డే పై దారుణమైన విమర్శలు చేస్తున్నారు సమంత అక్కినేని అభిమానులు. మరోవైపు పూజాహెగ్డే అభిమానులు ఆమెకు సపోర్ట్ గా నిలుస్తున్నారు. ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్ చిన్మయి శ్రీపాద, ఫిమేల్ డైరెక్టర్ నందిని రెడ్డి కూడా పూజా హెగ్డే వ్యాఖ్యలపై స్పందిస్తూ వ్యంగ్యాస్త్రాలు విసురుతూ ఆమెను పరోక్షంగా విమర్శించారు. 


సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఒక స్క్రీన్ షాట్ ప్రకారం... పూజా హెగ్డే తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతా లో... సమంత అక్కినేని అంత అందగత్తె అసలే కాదు', అని ఒక పోస్ట్ పెట్టింది. దీంతో సమంత అభిమానులు వెంటనే మనస్థాపానికి గురై ఆమె సమంతాకు క్షమాపణ చెప్పాలంటూ సోషల్ మీడియాలో పెద్ద యుద్ధమే సృష్టించారు. ఈ క్రమంలోనే సింగర్ చిన్మయి శ్రీపాద పూజా హెగ్డే ని ఉద్దేశిస్తూ... ' దయచేసి నన్ను ఎవరైనా లవ్ చేయండి. నన్ను నేను ప్రేమిస్తున్నాను. నేను చాలా కరువు లో ఉన్నాను. నా ఖాతా హ్యాక్ కి గురికాలేదు', అని అంటూ రచ్చ చేసింది. నిజానకి సినిమా శ్రీపాద ఏదో ఒక విషయంలో తలదూర్చకుండా ఉండలేదు. పూజా హెగ్డే సమంత ల విషయంలో కూడా ఈమె స్పందించిందంటే పెద్దగా ఆశ్చర్యపడాల్సిన అవసరమే లేదు. అయితే ఈమె మినహాయించే నందినీరెడ్డి కూడా సమంతకు మద్దతు తెలుపుతూ పూజా హెగ్డే పై మరింత రెచ్చగొట్టే కామెంట్లను చేసింది. 


ఆమె మీడియా లో కామెంట్ చేస్తూ.... 'వాట్ ది హ్యాక్... లవ్ యూ, టూ. నా మెదడు దుష్ట గ్రహాంతరవాసుల చేత హ్యాక్ కి గురి కాబడింది. చెడ్డ గా ఉంటేనే సోషల్ మీడియా ఖాతాలు హ్యాక్ కి గురవుతాయి, చిన్మయి', అని పూజా హెగ్డే ని ఉద్దేశిస్తూ తీవ్ర స్థాయిలో వ్యంగ్యంతో కూడిన విమర్శలు చేసింది. సమంత అక్కినేని వీరిద్దరి వ్యాఖ్యలపై స్పందిస్తూ సరైన సమాచారం తెలిసినంతవరకు అందరూ మౌనం పాటించాలి. అప్పటివరకు హ్యాకింగ్ జోకులు నిషేధించబడ్డాయి', అని తెలిసీ తెలియకుండా ఎవరినీ కించపరిచే కూడదని పరోక్షంగా బుద్ధి చెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి: