మామూలుగా తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోల మధ్య మంచి స్నేహ పూర్వక సంబంధం ఉంటుంది కానీ కొన్ని కొన్ని సార్లు ప్రస్తుతం స్నేహితులుగా ఉన్న హీరోలు మధ్య కూడా కొన్ని వివాదాలు తలెత్తిన విషయం తెలిసిందే. అయితే ఇలా టాలీవుడ్లో మంచి గుర్తింపు ఉన్న  హీరోలుగా కొనసాగుతున్న నందమూరి బాలకృష్ణ రవితేజ మధ్య ఓ వివాదం తలెత్తింది. అది ఎన్నో రోజుల పాటు కొనసాగింది కూడా. అది కూడా వీరిద్దరి మధ్య ఒక హీరోయిన్ కారణంగా వివాదం తలెత్తింది. అయితే ప్రత్యక్షంగా వీరిద్దరూ అంతగా విమర్శలు చేసుకోకపోయినా అప్పటికీ... పరోక్షంగా మాత్రం వీరిద్దరి మధ్య పెద్దవార్  నడుస్తుంది. 

 


రవితేజ భద్ర సినిమా షూటింగ్ టైంలో... హీరోయిన్ బాలకృష్ణ రవితేజ మధ్య వివాదానికి కారణమైంది అప్పట్లో ప్రచారం జరిగింది. భద్ర సినిమా షూటింగ్ టైంలో బాలకృష్ణ మహారథి సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ రెండు సినిమాల్లో ఒకే హీరోయిన్ నటించింది. ఇక ఆ హీరోయిన్ వీరిద్దరి మధ్య వివాదానికి కారణమైంది ఆ హీరోయిన్ అని  వార్తలు వచ్చాయి . అయితే ఆ హీరోయిన్ దగ్గర బాలయ్య గురించి రవితేజ ఏదో అన్నారని... రవితేజ మాట్లాడిన మొత్తాన్ని ఆ హీరోయిన్ ఫోన్ లో రికార్డు చేసి బాలయ్యకు వినిపించిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. 

 


 ఈ క్రమంలోనే నందమూరి బాలకృష్ణ రవితేజ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా అప్పట్లో టాక్ కూడా వినిపించింది. ఇక ఆ తర్వాత వీరిద్దరి మధ్య తలెత్తిన వివాదాన్ని ఇండస్ట్రీ పెద్దలు కలగజేసుకుని సద్దుమణిగేలా చేశారు అని అప్పట్లో టాలీవుడ్లో పుకార్లు షికార్లు చేశాయి.  ఇక ఆ తర్వాత తెరమీద ఎక్కడ విమర్శలు చేసుకున్నప్పటికీ బాలయ్య కు పోటీగా రవితేజ సినిమాలను విడుదల చేయడం మొదలుపెట్టారు. బాలయ్య సినిమాకు పోటీగా తన సినిమాను విడుదల రవితేజ సినిమాలు మంచి సక్సెస్ను సాధించగా...  బాలయ్య సినిమాలు ఫ్లాప్ ను చవి చూశాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: