ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా లాక్ డౌన్ నేపథ్యంలో క్రికెట్ మ్యాచ్ లు అన్ని నిలిచిపోయిన విషయం తెలిసిందే. దీంతో ఎప్పుడు బిజీ బిజీగా ఉండే క్రికెట్ ఆటగాళ్లందరూ ప్రస్తుతం ఇంటికే పరిమితమయ్యారు. అయితే ఈ నేపథ్యంలోనే ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ మాత్రం ఇంట్లో ఖాళీగా కూర్చొని సోషల్ మీడియాలో హీరో గా మారిపోతున్నాడు. సోషల్ మీడియాలో తనదైన డాన్స్ పర్ఫార్మెన్స్ లు ఇస్తూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. మొన్నటి వరకు కేవలం క్రికెట్ ఆటలో హీరో అనిపించుకున్న డేవిడ్ వార్నర్ ప్రస్తుతం తన డాన్స్ పర్ఫార్మెన్స్ లతో కూడా హీరో అనిపించుకున్నారు. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర అవుతున్నాడు డేవిడ్ వార్నర్. 

 


 ఎందుకంటే తెలుగు హీరో లకు సంబంధించిన పాటలు  ఎక్కువగా సెలెక్ట్ చేసుకుంటూ దానిపై డాన్స్ పర్ఫార్మెన్స్ లు చేస్తూ ఇరగ దీస్తున్నాడు . కేవలం డాన్స్ పర్ఫార్మెన్స్ లు తానొక్కడే చేయడం కాదు...  తన ఫ్యామిలీ మొత్తం తో పర్ఫామెన్స్ లు చేస్తూ అదరగొడుతున్నాడు డేవిడ్ వార్నర్. ఇప్పటి టాలీవుడ్లోని సంబంధించిన పాటల పై డాన్స్ చేసి అదరగొట్టిన  విషయం తెలిసిందే. ఇక తాజాగా మరోసారి టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా లోని ఒక పాట కి డాన్స్ చేసి ఇరగదీసాడు డేవిడ్ వార్నర్. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. 

 


 మహేష్ బాబు హీరోగా రష్మిక మందన హీరోయిన్గా నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాలోనుంచి మైండ్ బ్లాక్ సాంగ్ టిక్ టాక్ టిక్ టాక్ లో వీడియో చేయాలని అభిమానులు డేవిడ్ వార్నర్ ని కోరగా.. అభిమానుల కోరిక నిమిత్తం ఆ సాంగ్ పై డాన్స్ చేసాడు డేవిడ్ వార్నర్. భార్యతో కలిసి అదిరిపోయే స్టెప్పులు వేశాడు ఈ సాంగ్ లో . అంతే కాదు ఇది కేవలం పార్ట్ 1 మాత్రమే అని చెప్పుకొచ్చాడు డేవిడ్ వార్నర్. ఇక మైండ్ బ్లాక్ సినిమా లో డేవిడ్ వార్నర్ డాన్స్ సూపర్ అనే చెప్పాలి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఎంతో మంది అభిమానులను ఆకర్షిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: