2019 జులై నెలలో సినిమా డైరెక్టర్ ఏఎల్ విజయ్ డాక్టర్ ఐశ్వర్య పెళ్లి చేసుకున్నారు. అప్పట్లో ఏ ఎల్ విజయ్ సోషల్ మీడియా వేదికగా... నేను డాక్టర్ ఐశ్వర్యని పెళ్లి చేసుకోబోతున్నాను. తనతో నాది అరేంజ్డ్ మ్యారేజ్. కేవలం బంధువుల సమక్షంలోనే నా పెళ్లి జరగబోతుంది అని తన అభిమానులకు చెప్పుకొచ్చారు. తలైవి దర్శకుడైన ఏఎల్ విజయ్ ఈ రోజు తండ్రి అయ్యారు. ఐశ్వర్యకు పండంటి బాబు పుట్టాడు. ప్రస్తుతం ఎల్.వి కుటుంబ సభ్యులంతా వీరికి అభినందనలు తెలుపుతూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

IHG
వాస్తవానికి ఏఎల్ విజయ్ కు ఐశ్వర్య రెండవ భార్య. తాను గతంలో రఘువరన్ బీటెక్ హీరోయిన్ అయిన అమలాపాల్ ను వివాహం చేసుకున్నారు. విక్రమ్ హీరోగా నటించిన దైవ తిరుమగళ్( తెలుగులో నాన్న సినిమా) కి ఏఎల్ విజయ్ దర్శకత్వం వహించగా... అమలాపాల్ కూడా ఈ సినిమాలో నటించింది. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి కాలక్రమేణా ప్రేమ చిగురించింది. తదనంతరం 2014వ సంవత్సరంలో జూన్ నెలలో వీళ్లిద్దరు పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులు మూడేళ్ల సంసారం చేసిన తర్వాత అనగా 2017 సంవత్సరంలో పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. భర్త ఏఎల్ విజయ్ తో విడాకులు తీసుకున్న తర్వాత కూడా అమలాపాల్ అతనితో సాన్నిహిత్యంగానే మెలిగింది. ఏఎల్ విజయ్ రెండవ వివాహం చేసుకున్నప్పుడు అమలాపాల్ సోషల్ మీడియా వేదికగా... విజయ్ చాలా మంచి వ్యక్తి. హృదయపూర్వకంగా అతనికి హ్యాపీ మ్యారీడ్ లైఫ్ విష్ చేస్తున్నాను. త్వరలోనే వాళ్లకి చాలా మంది పిల్లలు పుట్టాలని కోరుకుంటున్నాను', అని అమలాపాల్ చెప్పుకొచ్చింది. 

IHG
ఇకపోతే ఏ.ఎల్ విజయ్ అన్నయ్య, యాక్టర్ ఉదయా సోషల్ మీడియా వేదికగా... నేను పెద్దనాన్న అయ్యాను. ఈరోజు 11.45 నిమిషాలకు నా తమ్ముడు ఏఎల్ విజయ్, ఐశ్వర్య లకు ఓ పండంటి మగ బిడ్డ జన్మించాడు. నేను చాలా సంతోషంగా ఉన్నాను', అని ఆయన అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: