టాలీవుడ్ లో చాలా తక్కువ కాలంలో స్టార్ హీరో అయిన హీరో రామ్ చరణ్. తండ్రి ఇమేజ్ ఉన్నా లేకపోయినా సరే అతను మాత్రం సొంతగా పైకి వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు అనేది అందరికి తెలుస్తుంది. ఈ ఏడాది గాని గత ఏడాది గాని అతని సినిమాలు ఏమీ లేవు. గత ఏడాది ఒక సినిమా విడుదల అయినా సరే ఆ సినిమా హిట్ అవ్వలేదు. ఇక ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమా తర్వాత అతను ఒక సినిమాలో నటించడానికి ఇప్పటికే కథ కూడా విన్నాడు 

 

ఇక  కొరటాల శివ దర్శకత్వంలో అతను ఒక సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు అని టాలీవుడ్ లో టాక్. టాలీవుడ్ లో కొరటాల కు కమర్షియల్ గా మంచి గుర్తింపు ఉంది. పాన్ ఇండియా సినిమాల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టిన రామ్ చరణ్ ఇప్పుడు ఈ సినిమాను చేయడానికి సిద్దంగా ఉన్నాడు అని సమాచారం. కొరటాల ఒక కథ చెప్పారు అని తెలుస్తుంది. అయితే ఆ కథ రామ్ చరణ్ కి నచ్చలేదు అని వక్కంతం వంశీ ని కథ అడిగాడు అని సమాచారం. వక్కంతం వంశీ కథ ను ఇస్తే తాను చేయడానికి సిద్దంగా ఉన్నాను అని కొరటాల తో చెప్పాడని సమాచారం. 

 

అయితే కొరటాల మాత్రం కథ తనది అయితేనే ఓకే అని చెప్పినట్టు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. మరి రామ్ చరణ్ ఎం చేస్తాడు అనేది చూడాలి. ఆర్ఆర్ఆర్ విషయంలో రామ్ చరణ్ ఇప్పుడు వేరే ఏ సినిమా కథ కూడా వినడం లేదు. అతను వచ్చే ఏడాది మాత్రమే సినిమాలు చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. మరి ఎం చేస్తాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: