తెలుగులో కొన్ని కొన్ని సినిమాల గురించి ఇప్పుడు ఎక్కువగా చర్చలు జరుగుతున్నాయి. అందులో ప్రధానంగా చెప్పుకునే సినిమా ఆచార్య. ఈ సినిమా కోసం చిరంజీవి సహా దర్శకుడు కొరటాల శివ పడుతున్న కష్టం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈ సినిమాలో ఇప్పుడు కొన్ని కొన్ని సన్నివేశాలకు సంబంధించి కథను మళ్ళీ రాసే ప్రయత్నాలు చేస్తున్నారు అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. కొన్ని కొన్ని సనివేశాల్ విషయంలో చిరంజీవి నుంచి దర్శకుడికి అభ్యంతరాలు వచ్చాయి అని అందుకే కథను ఇప్పుడు మార్చే ప్రయత్నం దర్శకుడు చేస్తున్నాడు అని తెలుస్తుంది. 

 

ఇక ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలను షూట్ చేసిన వాటిని కూడా డిలీట్ చేసే అవకాశం ఉందని వాటి విషయంలో చిరంజీవి అసహనంగా ఉన్నారు అని సమాచారం కొరటాల ఇప్పటికే ఇదే విషయాన్ని నిర్మాత రామ్ చరణ్ కి కూడా చెప్పినట్టు టాలీవుడ్ లో టాక్. ఇక ఈ సీన్స్ ని తీసి వేసే విషయంలో దర్శకుడికి చిరంజీవి కి మధ్య కాస్త గ్యాప్ వచ్చింది అనేది కొందరి మాట. సీన్ నచ్చలేదు అని చిరంజీవి చెప్తున్నా ఎడిటింగ్ లో మారుస్తామని చెప్తున్నారట కొరటాల. ఇక ఈ సినిమాలో డూప్ అనేది వద్దు అని చిరంజీవి అంటున్నారు అని సమాచారం. 

 

అయితే రామ్ చరణ్ మాత్రం తన తండ్రి ఆరోగ్యాన్ని దృష్టి లో పెట్టుకుని కొన్ని కొన్ని  సన్నివేశాలకు సంబంధించి డూప్ ని తీసుకోవాలని దర్శకుడికి సూచనలు చేసినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే చిరంజీవి మాత్రం తానే చేస్తా అని పట్టుదలగా ఉన్నారట.  ఇక ఈ సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుంది అనేది స్పష్టత రావడం లేదు. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం. చూడాలి మరి...

మరింత సమాచారం తెలుసుకోండి: