అగ్ర దర్శకులు అగ్ర నిర్మాతలు ఇప్పుడు భవిష్యత్తు విషయంలో ఏ స్థాయిలో ఆందోళన తో ఉన్నారు అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అగ్ర హీరోలతో చేసే సినిమాలు అయినా చిన్న హీరోలతో చేసే సినిమాలు అయినా సరే ఇప్పుడు చాలా వరకు జాగ్రత్తలు తీసుకుని సినిమాలు చేసే అవకాశం  ఉందని ప్రచారం జరుగుతుంది. అగ్ర హీరోలు చాలా వరకు భారీగా డిమాండ్ చేసే అవకాశం ఉండటం తో ఇప్పుడు చాలా వరకు ఆందోళన లో ఉన్నారు అని సమాచారం. ఇక ఇప్పుడు అగ్ర హీరోలతో సినిమాలను పక్కన పెట్టాలి అని అగ్ర నిర్మాతలు భావిస్తున్నారు. 

 

లాక్ డౌన్ లోనే ఇబ్బంది పడుతున్నామని వారికి ఎక్కడ తాము ఇవ్వాలి అని భావిస్తూ చాలా మంది హీరోలను పక్కన పెట్టేసే యోచనలో నిర్మాతలు ఉన్నారు అని తెలుస్తుంది. దిల్ రాజు ఇప్పుడు ఇదే ఆలోచనలో ఉన్నాడు అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అలాగే మరో నిర్మాత కూడా దాదాపు ఇదే ప్రయత్నాల్లో ఉన్నట్టు సమాచారం. దానయ్య కూడా ఆర్ఆర్ఆర్ తర్వాత ఇదే విధంగా సినిమాలు చేసే అవకాశం ఉందని సమాచారం. ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ఆయన చాలా వరకు నష్టపోయారు అని సమాచారం 

 

సినిమా విడుదల తర్వాత తనకు లాభాలు వచ్చినా సరే ఆయన ఇప్పుడు మాత్రం ఇబ్బంది బాగా పడుతున్నారు అనేది టాలీవుడ్ జనాల మాట. అందుకే ఇప్పుడు ఆయన చాలా వరకు జాగ్రత్తగా సినిమాలను చేసే ఆలోచనలో ఉన్నారు అని అంటున్నారు. వచ్చే ఏడాది మొత్తం ఆయన సినిమాలు చిన్న హీరోలతోనే ఉండే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు. మరి ఇది ఎంత వరకు నిజమో చూడాలి. ఇప్పుడు మరికొందరు నిర్మాతలు కూడా ఇదే ప్లాన్ లో ఉన్నారట. మరి ఏ విధంగా సినిమాలు చేస్తారు అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: