అగ్ర హీరోల సినిమాలు అనగానే ఇప్పుడు మన తెలుగులో ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వారి సినిమా విడుదల అవుతుంది అంటే చాలు జనాలు పనులు మానుకుని మరీ ఎదురు చూస్తూ ఉంటారు. ఒక్క సినిమా విడుదల అయినా చాలు అనుకునే విధంగా పరిస్థితి ఉంటుంది తెలుగులో. అయితే ఇప్పుడు వారి సినిమాలను కొనడానికి ఎవరూ ముందుకు రావడం లేదు అనే వార్తలు వస్తున్నాయి. వారి సినిమాల మీద గతంలో ఉన్న ఆసక్తి ఇప్పుడు బయ్యర్లకు దాదాపుగా లేదు అని వార్తలు వస్తున్నాయి. 

 

ఎంత వరకు నిజం అనేది తెలియదు గాని ఇప్పుడు అగ్ర హీరోల సినిమాలను కొనడానికి ఎవరూ కూడా ఆసక్తి చూపించడం లేదు అనే ప్రచారం జరుగుతుంది. లాక్ డౌన్ కి ముందు సంక్రాంతి తర్వాత విడుదల అయిన సినిమాలు అన్నీ కూడా ఫ్లాప్ అయ్యాయి. దీనితో సినిమాలు కొనుక్కున్న వాళ్ళు తీవ్రంగా నష్టపోయిన సంగతి తెలిసిందే. అందుకే ఇప్పుడు ఆ అప్పులు కట్టలేక... ఇక కొత్త సినిమాలు పెద్ద హీరోలవి కొనుక్కోవద్దు అని అనవసరంగా నష్టపోవడం ఎందుకు అని భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది మన తెలుగులో. 

 

స్టార్ హీరోలు ఎవరు అయినా సరే పక్కన పెట్టడం మంచిది అనే భావన లో ఉన్నారు అని సామాచారం. ప్రస్తుతం అగ్ర హీరోల సినిమాలు ఏమీ విడుదలకు సిద్దంగా లేవు. వచ్చే ఏడాది మాత్రమే అవి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయినా సరే సినిమాలను ఇక వద్దు అని భావిస్తూ చిన్న హీరోల సినిమాలను మాత్రమే కొనుక్కోవాలి అనే ఆలోచనలో ఉన్నారు అని అంటున్నారు.  మరి ఇది ఎంత వరకు నిజం అనేది పక్కన పెడితే టాలీవుడ్ లో మాత్రం దీనిపై ఆందోళన కూడా ఉంది అని అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. అదే జరిగితే నష్టమే.

మరింత సమాచారం తెలుసుకోండి: