'బాహుబలి' సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా RRR. ఈ సినిమాపై దేశవ్యాప్తంగా తో పాటు అంతర్జాతీయ స్థాయిలో అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయ్. మొట్టమొదటిసారి ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ కలిసి నటిస్తున్న నేపథ్యంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో అయితే ఈ సినిమాపై అంచనాలు ఇప్పటిదాకా వచ్చిన ఏ సినిమాపై లేనంతగా ఉన్నాయి. స్వాతంత్ర పోరాట నేపథ్యంలో అల్లూరి సీతారామరాజు మరియు కొమరం భీమ్ కలిసి పోరాటం చేస్తే ఎలా ఉంటుంది అనే కల్పిత కథతో ఫిక్షన్ తరహాలో ఈ సినిమాని రాజమౌళి తెరకెక్కించబోతున్నారు.

IHG

ఇదిలా ఉండగా ఈ సినిమాలో ఎన్టీఆర్ హైలెట్ సీన్ ఇదే అన్ని ఒక వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది.  అదేమిటంటేఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా బ్రిటీష్ అమ్మాయిగా ఒలివియా మోరిస్ యాక్ట్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఒలివియా మోరిస్ మరియు ఎన్టీఆర్ మధ్య వచ్చే లవ్ ట్రాక్ సినిమాకే హైలెట్ అని వారిద్దరి మధ్య వచ్చే రొమాంటిక్ సన్నివేశాలు మరియు ఓ రొమాంటిక్ సాంగ్ సినిమాకే  హైలెట్ అనే వార్తలు వినపడుతున్నాయి.

IHG

అంతేకాకుండా లాక్ డౌన్ ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత షూటింగులకు పరిమిషన్ వచ్చిన తరువాత ఎన్టీఆర్ లుక్ కి సంబంధించిన వీడియో ఓరేంజ్ లో ఉండబోతున్నట్లు విడుదల చేయబోతున్నట్లు సినిమా యూనిట్ నుండి అందుతున్న సమాచారం. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా చెర్రీ లుక్ కి సంబంధించి విడుదలైన వీడియోలో చరణ్ బాడీకి మరియు ఎన్టీఆర్ చెప్పిన బ్యాక్ గ్రౌండ్ డైలాగులకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సమయం లో ఎన్టీఆర్ లుక్ ఎలా ఉండబోతుందో అన్న ఉత్కంఠ ప్రతి ఒక్కరిలో నెలకొంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: