కరోనా అందరిని సమానంగా చూసింది. ముఖ్యంగా చిత్ర పరిశ్రమలని. తెలుగు తమిళం, తెలుగు, హిందీ ఇలా బేధాలేవీ లేకుండా అందరీని ఇంట్లో కూర్చోబెట్టింది. భాషా బేధం చూపించకుండా అన్ని చిత్ర పరిశ్రమలకి కోట్లలో నష్టం వచ్చేలా చేసింది. ప్రతీ చిత్ర పరిశ్రమ సమ్మర్ ని చాలా పక్కాగా ప్లాన్ చేసుకుంటుంది. మార్చ్ నెలాఖరు నుంచి జూన్ వరకు చిన్న సినిమాల నుంచి భారీ బడ్జెట్ సినిమాల వరకు చాలా సినిమాలని రిలీజ్ కి ప్లాన్ చేసుకుంటారు మేకర్స్. ఇక మార్కెట్ పెంచుకోవడానికి దర్శకులకి, హీరోలకి, హీరోయిన్ లకి ఎండాకాలం సెలవులు చాలా ఉపయోగపడతాయి. కాని ఈ సారి కరోనా దెబ్బకి మొత్తం తలకిందులైపోయింది.

 

ఇక సౌత్ సినిమా ఇండస్ట్రీలలో దర్శకుడు మణిరత్నం క్లాసిక్ సినిమాతో సంచలన సృష్టించారు. కాని గత కొంతకాలంగా ఈ స్టార్ డైరెక్టర్ కి వరసగా ఫ్లాపులొచ్చి పడుతున్నాయి. దాంతో కనీసం యంగ్ డైరెక్టర్స్ తో కూడా పోటీ పడలేకపోతున్నారు. ప్రస్తుతం మణిరత్నం హిస్టారికల్ మూవీ ‘పొన్నియిన్ సెల్వన్’.ఎంతో పకడ్బంధీగా ప్లాన్ చేసుకున్న ఈ సినిమా షూటింగ్ లాక్ డౌన్ కారణంగా ఆగిపోయింది. ఈ సినిమాని విక్రమ్, కార్తి, శరత్ కుమార్, జయం రవి, ప్రభు, జయరామ్, ఐశ్వర్యరాయ్, త్రిష, ఐశ్వర్యలక్ష్మీ....వంటి భారీ కాస్టింగ్ తో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ప్రధాన తారాగణం పై థాయ్ లాండ్ అడవుల్లో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు.

 

ఇక చెన్నైలోను ఈ సినిమా కోసం భారీ సెట్టింగ్స్ నిర్మించి చిత్రీకరణ కి ప్లాన్ చేసుకున్నారు మణిరత్నం అండ్ టీం. అయితే అదంతా ఒక్క కరోనా దెబ్బకి తారుమారు అయిపోయింది. హిస్టారికల్ బ్యాగ్డ్రాప్ లో రూపొందించే సినిమా కావడంతో ప్రభుత్వం సినిమాలకు అనుమతి ఇచ్చినా ఇందులో వందలాది మంది సైనికులుగా నటించాల్సి ఉందట. కాని కరోనా మహమ్మారితో ఇంతమందితో షూటింగ్ జరపడం సాధ్యమయ్యో పని కాదు. అంతేకాదు అందుకు ప్రభుత్వం కూడా అనుమతించదు. 

 

దీంతో ఇప్పట్లో ‘పొన్నియన్ సెల్వన్’ సినిమా షూటింగ్ కి తాత్కాలికంగా నిలుపుతున్నట్టు ప్రకటించి సంచలన నిర్ణయం తీసుకున్నారు మణిరత్నం. దీంతో ఇక మణిరత్నం ఇప్పుడప్పుడే సక్సస్ ని దక్కించుకోవడం కష్టం అంటూ కోలీవుడ్ లో చెప్పుకుంటున్నారట. అయితే తక్కువ కాస్టింగ్ తో అతికొద్ది మంది టెక్నికల్ టీం తో ఒక కమర్షియల్ సినిమాని తెరకెక్కించాలని సన్నాహాలు చేస్తున్నారట. 

మరింత సమాచారం తెలుసుకోండి: